Telugu States: రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవాళ్లకు భారీ షాక్.. అలా కుదరదంటూ?

Telugu States: త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కసరత్తులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 2.07 కోట్ల మంది మహిళలు, 1.99 కోట్ల మంది పురుషులు ఉన్నారు. కానీ అందులో కేవలం 7.88 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అని ఆయన తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందని తెలిపారు.

 

అలాగే గతంలో అక్రమంగా తొలగింపునకు గురైన సుమారు 13 వేల ఓట్లను పునరుద్ధరించామని చెబుతూనే ఈ సందర్బంగా ఆయన మరీకొన్ని కీలక విషయాల గురించి ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం నేరం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయరాదని స్పష్టం చేశారు. రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఎవరికైనా ఓటు హక్కు ఒక్క చోటునే ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు హక్కు ఉంటుందని ఆయన తెలిపారు. నివాసులై ఉంటున్న చోటే ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, వారిపై కేసు నమోదు అవుతుందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వారు ఇక్కడ ఓటుకు ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -