Ravi Teja: రవితేజకు ఇచ్చిన మాటను తప్పుతున్నారా.. మరీ ఇంత మోసమా?

Ravi Teja: నిజానికి సంక్రాంతి సినిమాల పోటీలో నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, తేజ సజ్జ సినిమాలతో పాటు రవితేజ సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే తెలుగు పరిశ్రమ బాగు కోసం ఆలోచించిన ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు పోటీనుంచి ఏ సినిమా అయినా తప్పుకుంటే సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ ఇస్తామని మాట ఇచ్చారు. దాంతో ఈగల్ సినిమాని వాయిదా వేశారు ఆ సినిమా నిర్మాతలు. అయితే ఆ మాటను ఫిలిం ఛాంబర్ నిలబెట్టుకునేటట్లు కనిపించడం లేదు రవితేజ కి అన్యాయం జరుగుతుందేమో అని అప్పుడే మాస్ మహారాజా ఫ్యాన్స్ బెంగ పెట్టుకుంటున్నారు.

 

ఇంతకీ ఏం జరిగిందంటే ఫిబ్రవరి 9న ఈగల్ సినిమా సోలో రిలీజ్ చేసుకోవచ్చని ఫిలిం ఛాంబర్ చెప్పింది అయితే అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన లాల్ సలాం విడుదలకు సిద్ధపడుతుంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ పోస్ట్ పోన్ చేసుకొని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. డీజెటిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్లు.

ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో కీలక మలుపుల ఆధారంగా రూపొందిన యాత్ర టు ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా ప్రొడ్యూసర్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక గత కొద్ది కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న సందీప్ కిషన్ సినిమా ఊరు పేరు భైరవకోన సినిమా కూడా ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి నిర్మాత అనిల్ సుంకర రెడీగా ఉన్నారు.

 

ఒకవేళ ఛాంబర్ పెద్దలు అనిల్ సుంకరతో మాట్లాడితే ఆ సినిమా విడుదల వాయిదా పడుతుందేమో కానీ యాత్ర టు లాల్ సలాం వాయిదా పడటం కష్టమే. ఏ రకంగా చూసుకున్నా ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఫిబ్రవరి 9కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఆ వీక్ అంతా వాలెంటెన్స్ వీక్ కుర్రాళ్ళందరూ సినిమాల పై దృష్టి పెట్టే సమయం అందుకే ఆ డేట్ కి సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -