Veera Simha Reddy: అక్కడ 365 రోజులు పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి.. బాలయ్య గ్రేట్ అనేలా?

Veera Simha Reddy: నందమూరి నటి సింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరొక అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు బాలయ్య. గత ఏడది సంక్రాంతి బరిలో దిగి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యతో పోటీపడి గెలిచిన బాలయ్య సినిమా వీరసింహారెడ్డి.

 

శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు.బాలయ్య కెరియర్ లోనే ఎప్పుడు లేనట్టుగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 54 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది నిజంగా సెన్సేషనల్ విజయం అని చెప్పాలి. అయితే ఇప్పుడు అదే సినిమా కర్నూలు జిల్లాలోని ఆలూరు శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో 365 రోజుల దిశగా దూసుకుపోతుంది.

మరొక రెండు రోజుల్లో 365 రోజులు కంప్లీట్ అవుతాయి. నేటి రోజుల్లో నెలరోజులు ఆడడమే గొప్ప. సినిమా చాలా బాగుంటే 50 రోజులు ఆడుతుంది వంద రోజులు ఆడటం అనేది గగనం అయిపోయింది కానీ బాలయ్య సినిమా 365 రోజులు ఆడటం అంటే నిజంగా గ్రేట్ అది కూడా షిఫ్ట్ ప్రకారం కాకుండా నాలుగు షోలు కూడా వీర సింహారెడ్డి సినిమా మాత్రమే వేస్తున్నారు.

 

ఇప్పటికే బాలయ్య ఖాతాలో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు గతంలో 365 రోజులు ఆడాయి. ఇంకొక మూడు రోజుల్లో వీరసింహారెడ్డి సినిమా కూడా ఆ రికార్డుని సొంతం చేసుకోబోతుంది టాలీవుడ్ లో ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు 365 రోజులు ఆడిన రికార్డులు ఎవ్వరికీ లేవు ఈ విషయంలో నటసింహ బాలయ్య దరిదాపుల్లో కూడా ఏ హీరో లేరని చెప్పాలి. బాలయ్య ఈ రికార్డుని సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు జై బాలయ్య అంటూ మీసం మెలేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -