Guntur Kaaram: గుంటూరు కారంలో రమణగాడి బీడీ వెనుక అసలు నిజాలు మీకు తెలుసా?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి జనవరి 12న విడుదల అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా ఎస్. ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు బీడీలు కాలుస్తూ చాలా చోట్ల మనకు కనిపిస్తారు.

 

కానీ నిజ జీవితంలో మహేష్ బాబుకి సిగరెట్ అలవాటు లేదు. మరి ఈ సినిమాలో ఆ బీడీలు వెనుక అసలు కధేంటో మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. త్రివిక్రమ్ ఈ కథ చెప్పినప్పుడు ముందు మహేష్ బాబుకి ఒక సిగరెట్ ఇచ్చి కాల్చమన్నారట. అది కాల్చిన వెంటనే మహేష్ బాబుకి తల తిరిగినట్టు అనిపించి వెంటనే త్రివిక్రమ్ తో నా వల్ల కాదు ఈ సిగరెట్లు అని అన్నారట.

అప్పుడు వెంటనే అక్కడ ఉన్న టీంలో ఒక అతను ఒక బీడీని ఇచ్చి ఇది కాల్చమని చెప్పారట. ఆ బీడి ఆయుర్వేదంతో లవంగాలతో తయారు చేసిందని గుట్కా లాంటివి ఏమీ కలిగి లేవని చెప్పారు. అప్పుడు మహేష్ బాబు ఆ సిగరెట్లు వాడడం మొదలుపెట్టారట. సినిమా అంతా వాటినే వాడుతూ రమణ గాడు మంచి ఊపు మీద సినిమాలో రెచ్చిపోయాడు.

 

బాబు సిగరెట్ స్టైల్ కి యాక్షన్ కి విజిల్స్ పడ్డాయి. ఈ విషయాన్ని మహేష్ బాబు సుమతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పగా సుమ ఈ విషయాన్ని తెలుసుకొని ఈ బీడీలు ఒక బ్రాండ్ తో మార్కెట్లోకి వస్తే అందరి హెల్త్ బాగుంటుంది అని చెప్పింది. అయితే ఇంటర్వ్యూలో శ్రీ లీల కూడా పాల్గొని ఈ సినిమా కబుర్లన్నీ ఈ ఇంటర్వ్యూలో చెప్పింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -