Vijay: బాలయ్య విలన్ విజయ్ మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

Vijay: కన్నడ సినిమా దునియాలో నటించి ఆ సినిమా పేరు నే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు దునియా విజయ్. కన్నడలో ఆయన పెద్ద మాస్ స్టార్. తెలుగులో వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ముసలిమడుగు ప్రతాపరెడ్డిగా ఆయన తనదైన శైలిలో విలనిజాన్ని పండించారు. అయితే జనవరి 20 ఆయన జన్మదినం. ఈ శుభ సందర్భంగా ఆయన తన స్వగ్రామం కుంబరనహళ్లి లో ఎంతో ఉత్సాహంగా పర్యటించారు.

ప్రతి వీధి తిరుగుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను స్థానికులతో పంచుకున్నారు బంధువులతో స్నేహితులతోనూ సరదాగా గడిపారు. మాటల సందర్భంలో ఆ ఊరిలో కొన్ని కుటుంబాలు అనివార్య కారణాల వలన జైల్లో ఉన్నారని తెలుసుకున్నాడు. తమ కుటుంబ సభ్యులను విడిపించాలని గ్రామస్తులు కోరుకోవటంతో విజయ్ వెంటనే తన లాయర్లను సంప్రదించి తన స్వగ్రామానికి చెందిన ఆరుగురు ఖైదీలను విడిపించారు.

 

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలను దునియా విజయ్ స్వయంగా విడుదల చేయించారు. శిక్షాకాలం పూర్తయినప్పటికీ జరిమానా చెల్లించేందుకు వారి వద్ద డబ్బు లేకపోవడంతో ఈ ఆరుగురు ఖైదీలు అదనపు శిక్షను అనుభవిస్తున్నారు. తన లాయర్ ద్వారా డబ్బును చెల్లించి స్వగ్రామానికి చెందిన ఆరుగురిని కస్టడీ నుంచి విడిపించారు దునియా విజయ్. కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉండే వ్యక్తులు కుటుంబాలతో లేకపోతే జీవించడం చాలా కష్టం అలాంటి బాధ ఎవరికి రాకూడదు అంటూ ఎమోషనల్ అయ్యాడు విజయ్.

 

మంచి మనసు గల ఈనటుడు గతంలో కూడా ఒక సినిమా షూటింగ్ కోసం మైసూర్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఖైదీలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధ ఖైదీలు జరిమానా చెల్లిస్తే విడుదల చేసేందుకు అనుమతి ఉంది కానీ వారి వద్ద చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో దునియా విజయ్ డబ్బు సహాయం చేసి 62 మంది ఖైదీలను అక్కడ నుంచి విడుదల చేయించారు. ఈ నటుడు గొప్ప మనసుకి అందరూ ఫిదా అవుతూ బర్త్డే విషెస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -