Balayya: బాలయ్య, మోక్షజ్ఞ అఖండ2 లో కనిపిస్తారా.. వేరే లెవెల్ అంటూ?

Balayya: నందమూరి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో సుస్థిరమైన స్థానాన్ని స్థిరపరచుకున్నారు. కానీ నందమూరి అభిమానుల దాహం ఇంకా తీరలేదు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. అందుకే భగవంత్ కేసరి షూటింగ్ లో చాలా మటుకు మోక్షజ్ఞని కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేశారు బాలయ్య. అయితే మోక్షజ్ఞ ఏ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు అనే వివరాలు ఏవి ప్రకటించకపోవడం గమనార్హం.

 

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. త్వరలోనే అఖండ 2 సినిమా రాబోతుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను ఆ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి అఖండ 2 సినిమా ద్వారా బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని అర్థమవుతుంది.

ఈ వార్త విన్నప్పటినుంచి నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ మూవీ టీం చేయకపోవడం గమనార్హం. నిజానికి 2017 లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ జరుగుతుందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది.

 

నందమూరి బాలకృష్ణ కూడా సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు తండ్రి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తర్వాత సోలో హీరోగా నిలదొక్కుకొని ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు కొడుకు విషయంలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లున్నారు. బాలకృష్ణ సెంటిమెంటు నిజమైనట్లయితే బాలయ్య లాగే మోక్షజ్ఞ కూడా టాలీవుడ్ టాప్ స్టార్ అవడం ఖాయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -