Samantha: కెరీర్ తొలినాళ్లలో సమంతకు జరిగిన అవమానం తెలుసా?

Samantha: టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ఆగ్ర హీరోయిన్గా తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది సమంతా రూత్ ప్రభు. దాదాపు అందరి ఆగ్ర హీరోలు సరసన నటించింది. టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ల జాబితాలో తిన పేరు కచ్చితంగా ఉంటుంది. తన అందం, అభినయం, నటనతో కుర్రాల మనసును దోచుకుంది సమంత. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే జెస్సి అనే పాత్రలో యువత అందరిని ఒక ఉప్పు ఉపేసింది.

 

డైరెక్టర్ గౌతమ్ మీనన్ సమంతని జెస్సీ పాత్రలో చాలా అట్రాక్టివ్ గా చూపించారు. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వరుసగా ఆగ్ర హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది సమంతకి. తర్వాతే ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్లు తెచ్చుకుంది సమంత. ఇప్పుడు కేవలం గ్లామరస్ రూల్స్ ఏ కాకుండా యశోద లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా తీస్తూ అందరినీ మెప్పిస్తుంది.

అయితే సమంత 2010లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఆటోలో ఒక సినిమా ఆడిషన్ కి వెళ్ళిందట. కానీ ఆ డైరెక్టర్ సమంత అని రిజెక్ట్ చేశారు. ఆ సినిమా పేరు స్నేహగీతం. ఇందులో సందీప్ కిషన్, వెంకీ అట్లూరి, చైతన్య హీరోలుగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత ఆడిషన్ చేసిందట కానీ తనని రిజెక్ట్ చేశారు.

 

ఇప్పుడు వాళ్ళకి అందని స్థాయిలో స్టార్ డంని తెచ్చుకుంది సమంత. ప్రస్తుతానికి బ్రేక్ లో ఉన్న సమంత త్వరలోనే సితాడిల్ అని వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కనిపించనున్నది. ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ అండ్ డికె నే ఈ సినిమాని దర్శకిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో త్వరలోనే విడుదల కాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -