Thaman: వైరల్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Thaman: ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా వార్ 2. ఈ మూవీ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో వార్ 2 మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్,హృతిక్ రోష‌న్‌ కలయికలో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి హృతిక్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఫైటర్ సక్సెస్ ఇంటర్వ్యూలో హృతిక్ మాట్లాడుతూ..

 

ఇంకా వార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఎన్టీఆర్‌ తో జరిగే షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. దానికోసం వేచిచూస్తున్నాను అని హృతిక్ తెలిపారు. కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మార్చి మొదటి వారం నుంచి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ అనంతరం ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ ల పై ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని, దాని కోసం ప్రస్తుతం ఒక ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వార్ 2 కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఏది ఏమైనా వార్ 2 అనేది యాక్షన్ ఫిల్మ్.

మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి మరి. కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -