Blue Media: కుమారి ఆంటీ విషయంలో నీలి మీడియా ఓవరాక్షన్.. ఏమైందంటే?

Blue Media: తెలంగాణలో వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆంటీ కి జగన్ ప్రభుత్వం ఏపీలో భూమి కేటాయించిందని జగన్ గొప్ప మనసు గురించి ఇప్పటికైనా తెలుసుకోవాలని వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక కుమారి ఆంటీ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన కుమారి ఆంటీ స్టాల్ కు ఇప్పుడు ఆమెకి ఉన్న పాపులారిటీ ఇబ్బందులు తెచ్చి పెట్టింది.

 

ఆమె స్టాల్ కి కస్టమర్లు పెరగడంతో రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలను తొలగించడానికి కుమారి ఆంటీని ఆ స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది. అయితే దీనిని అడ్డం పెట్టుకున్న వైసీపీ మద్దతుదారులు రేవంత్ రెడ్డి కావాలనే ఆమెపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని సొంత కథనాలు వల్లెవేశాయి. బ్లూ మీడియా కూడా అందుకు తోడైంది.

అయితే ఈ కథలు కంచికి చేరటానికి ముందే రేవంత్ రెడ్డి తెలివిగా సమస్యను చక్కదిద్దేశారు. దానితో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూనే సదరు వ్యాపారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారిదే అంటూ రేవంత్ చిరు వ్యాపారి కోసం తన ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని సైతం వ్యతిరేకించారు. త్వరలోనే తాను కూడా అక్కడికి వెళ్లి ఆ ఫుడ్ టేస్ట్ చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

 

అయితే కుమారి ఆంటీ మీద ఎంత ప్రేమ చూపించి ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంటలక్కకు మద్దతుగా కథనాలు ప్రచారం చేసిన సాక్షి అమరావతి రైతుల వ్యధలను కూడా ప్రచారం చేయగలరా అంత దమ్ము ధైర్యం సదరు మీడియా వారికి ఉన్నాయా అంటూ అదే సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వం పై బ్లూ మీడియా పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -