Rashmika: రష్మిక చేతిపై ఉన్న ఈ టాటూల వెనుక అంత అర్థముందా?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టినటువంటి ఈమె కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టినటువంటి ఈమె వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

రష్మిక నటించిన యానిమల్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. రష్మిక పుష్ప 2 సినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

రష్మిక చేతి పై ఉన్నటువంటి టాటూలకు సంబంధించి ఈ వార్త వైరల్ అవుతుంది. రష్మిక చేతి మనికట్టుపై ఒక టాటూ అలాగే రింగ్ ఫింగర్ పై మరొక టాటూ ఉంది చేతి మణికట్టుపై ఉన్నటువంటి టాటూ తరచూ మనం చూస్తూనే ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి టాటూ ఇర్రీప్లేసబుల్ . ఈ టాటూ అర్థమేంటి అనే విషయాలను ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గతంలో రష్మిక వెల్లడించారు.

 

మనలోని ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటారు. మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని మరోక వ్యక్తితో భర్తీ చేయలేరు. అందుకే తనకు ఆ టాటూ అంటే చాలా ఇష్టమని ఈమె కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆ టాటూ వేయించుకున్నట్లు తెలిపారు. ఇక తన కుడి చేతి ఉంగరపు వేలు పై ఇన్ఫినిటీ అనే టాటూ ఉంది. ఈ టాటూకి అనంతం అని అర్థం. ఈ పచ్చబొట్టు ఎప్పుడూ కనిపించదు..కానీ ఇటీవల రష్మిక షేర్ చేసిన సెల్ఫీలో చేతి వేలి పై ఉన్న ఈ టాటూ కనిపించడంతో అందరూ ఈ టాటూ మీనింగ్ ఏంటని తెగ సర్చ్ చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -