Jagapathi Babu: జగపతిబాబు ఆ సినిమాలో విలన్ రోల్ చేయడానికి అసలు కారణమిదా?

Jagapathi Babu: ఫ్యామిలీ హీరోగా జగపతిబాబుకి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో నుంచి విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు జగపతిబాబు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ శాండిల్ వుడ్ లో కూడా ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అయితే ఇదంతా ఒకే ఒక్క సినిమా వల్ల జరిగింది. ఆ సినిమా జగపతిబాబు కెరియర్ లో లేకపోతే జగపతిబాబు కెరియర్ ఎప్పుడో ఎండ్ అయిపోయి ఉండేది ఆ సినిమా యే లెజెండ్.

 

హీరోగా శుభాకాంక్షలు,శుభలగ్నం వంటి ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకున్నాడు జగపతిబాబు. హీరోగా కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సడన్ గా కెరియర్ ఫాల్డౌన్ అయింది. ఇక ఆలోచనలో పడ్డ జగపతిబాబు ఇంపార్టెన్స్ ఉన్న ఏ క్యారెక్టర్ చేయడానికి అయినా సిద్ధం అనుకొని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అప్పటికే బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో విలన్ రోల్ కోసం నటులను పరిశీలిస్తున్నాడు.

అప్పుడే బోయపాటి జగపతి బాబు ఫోటోలు చూసి ఆ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఆ సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్, బాలయ్య డైలాగ్స్ ఎంత ఆకట్టుకున్నాయో జగపతిబాబు నటన అంత ఆకట్టుకుంది. సినిమాలో బాలకృష్ణకి వచ్చినంత పేరు జగపతిబాబుకి కూడా రావటం విశేషం. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారే తరుణంలో చాలా రోజులు సినిమా అవకాశాలు రాలేదు.

 

అప్పుడు చాలామంది చులకనగా కూడా మాట్లాడారు. అయితే సరి అయిన సమయంలో సరైనసినిమా పడింది. అనుకున్న దానికన్నా డబల్ పేమెంట్ ఇచ్చారు అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు జగపతిబాబు. లెజెండ్ సినిమా తరువాత రంగస్థలం,నాన్నకు ప్రేమతో, మహర్షి, విశ్వాసం, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించి ఇప్పుడు స్టార్ విలన్ గా రూపాంతరం చెందాడు జగపతిబాబు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -