MLA Mahidhar Reddy: బాబు, పవన్ లను తిట్టలేదని తీసేశారు.. కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ వైరల్!

MLA Mahidhar Reddy: వైసిపి పార్టీ నుంచి అభ్యర్థులుగా టికెట్ పొందాలి అంటే ప్రతిపక్షాలను ప్రెస్ మీట్ పెట్టి తీడితే చాలు టికెట్ వస్తుంది అనే ట్రెండ్ నడుస్తుంది. ఇలా ఎవరైతే ప్రతిపక్ష నేతలను తిట్టలేదు వారికి టికెట్ క్యాన్సిల్ అనే ట్రెండ్ వైసీపీలో కొనసాగుతుంది. తాజాగా కందుకూరు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రికి ఇలాంటి షాక్ తగిలింది. కందుకూరులో సీనియర్ రాజకీయ నాయకుడిగా మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి మహేందర్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురయింది.

కందుకూరు ఎమ్మెల్యే టికెట్ తనకి కాకుండా డాక్టర్ పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్ కు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై మహిధర్ రెడ్డి స్పందించి మాట్లాడినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈనెల 8వ తేదీన డాక్టర్ పెంచలయ్య వైసీపీ పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే తన కుమార్తె అరవిందకు టికెట్ ఇచ్చారని తెలిపారు.

గతంలో కొంతమంది వైకాపా నాయకులు తనని కలిసి తాను ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిపక్ష నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పట్ల వ్యక్తిగతంగా దూషణ చేయాలని చెప్పారు. నాకు టికెట్ కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసే వ్యక్తిత్వం నాది కాదు గతంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూడా గెలిచిన చరిత్ర మా కుటుంబానికి ఉంది టికెట్ కోసం ఇలా వెంపర్లాడే వ్యక్తిని తాను కాదు అంటూ వారికి క్లారిటీగా చెప్పాను.

ఇలా వారిని తిట్టడానికి నేను ఇష్టత చూపకపోవడంతో అప్పటినుంచి కందుకూరు టికెట్ తనకు రాదనే ప్రచారం కూడా జరిగిందని తెలిపారు. ఇక అప్పటినుంచి పలువురు నాయకులతో సీఎం చర్చలు జరిపారని నన్ను కూడా పిలిచి నాతో మాట్లాడితే మీ ఇష్టం మీకు నచ్చిన నిర్ణయం తీసుకోమని నేను చెప్పాను. ఈ క్రమంలోనే అరవింద యాదవ్ కు కందుకూరు టికెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతిపక్షాలను విమర్శించకపోతే ఇలా టికెట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతారా అంటూ తాజాగా ఈ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -