Nimmagadda Ramesh: దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ అని లెక్కలు చెప్పారు.. నిమ్మగడ్డ రమేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nimmagadda Ramesh: మరికొద్ది రోజులలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అలాగే ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు కట్టు దిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపడుతున్నారు.

ఇకపోతే గత ఎన్నికలలో వైసిపికి అంత మెజారిటీ రావటానికి దొంగ ఓట్లే కారణమంటూ ఇప్పటికి పలువురు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా విజయవాడలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశంలో భాగంగా సీ ఎఫ్ డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన (Nimmagadda Ramesh Kumar) మాట్లాడుతూ.. గతంలో తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో సుమారు 35 వేల దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఈ విధంగా దొంగ ఓట్లతో గెలిచి తమకు భారీ మెజారిటీ వచ్చిందని వైకాపా నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లు ఓటర్ ప్రొఫైల్ ఎప్పుడో సేకరించి పెట్టారని పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈయన మండిపడ్డారు.

ఇక ఈ ఎన్నికలలో వాలంటీర్ల ప్రమేయం ఏమాత్రం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా తెలియజేసింది. అందుకే వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈయన తెలిపారు. ఇక మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితులలో ఉందని తెలిపారు. ప్రధాని సభకు వచ్చినటువంటి ఒక వ్యక్తిని కిరాతకంగా చంపడం దారుణం అంటూ ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -