AP BJP: ఏపీలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయా.. అసలు లెక్కలివే!

AP BJP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో బిజెపి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇలా బిజెపి ప్రకటించిన ఆరుగురిలో కేవలం నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి భూపతి శ్రీనివాస వర్మ తప్ప మిగిలిన వారందరూ పార్టీలోకి కొత్తగా వచ్చినవారు.

ఇక వీరిలో వివాదాస్పదమైనటువంటి నాయకురాలిగా పేరుపొందిన కొత్తపల్లి గీతకు ఏకంగా అరకు ఎంపీగా టికెట్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఈసారి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వటం గమనార్హం. టీడీపీ నుంచి 2020లో బీజేపీలో చేరిన సీఎం ర‌మేష్‌కు అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానం ఇచ్చారు. ఇక్కడ ఈయన నాన్ లోకల్ కావటం గమనార్హం.

ఇక తిరుపతి ఎంపీ సీటు గురించి చెప్పాల్సిన పనిలేదు కూటమిలో భాగంగా బిజెపికి ఈ ఎంపీ స్థానం కట్టబెట్టారు. ఇందులో భాగంగా వైసిపి నుంచి వచ్చినటువంటి గూడూరు ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌కి తిరుపతి టికెట్ ఇచ్చారు అసలు ఈయనకు బీజేపీ నాయకులతో ఎవరితో కూడా సంబంధాలు లేవు.

ఇలా ఒక నరసాపురం అభ్యర్థి తప్ప మిగిలిన వారందరూ కూడా బిజెపికి కొత్తవాళ్లు అలాగే మరికొందరిని నాన్ లోకల్ గా నియమించడంతో వీరందరికీ ఆయా నియోజకవర్గాలలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి కలిసి నడిచే అభ్యర్థులు కూడా కరువే అయ్యారని చెప్పాలి. ఇలా బిజెపి ప్రకటించిన ఈ అభ్యర్థులను చూస్తే గెలుపు గుర్రాలు ఎక్కడ కష్టమేననే వాదన కూడా వినపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -