CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆ ఫోబియా ఉందా.. ఏడు దాటితే ఆ పని అస్సలు చేయరా?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ బస్సు యాత్రలో భాగంగా ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇలా బస్సు యాత్రలో భాగంగా ఈయన బస్సు ప్రయాణం చేస్తూ భారీ ఎత్తున బహిరంగ సవరణ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభలో భాగంగా ప్రతిపక్ష నేతలపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

అయితే ఎన్నికల అధికారులు ఆదేశాల మేరకు రాత్రి 10:00 వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏడు దాటిందంటే తన ప్రచార కార్యక్రమాలను ఆపేస్తున్నారు. అలాగే సభలను కూడా ముగించేస్తున్నారు. ఈయన వస్తారని పెద్ద ఎత్తున ర్యాంపు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ చీకటి పడుతుందని సెక్యూరిటీ వద్దంటున్నారని చెప్పి ర్యాంప్ వాక్ కూడా చేయడం లేదు.

జగన్మోహన్ రెడ్డికి రాత్రి 7:00 దాటితే ఎందుకు అంత భయం అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.జగన్‌కు భయం పట్టుకుందన్న భావన ఆ పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది. జగన్ పర్యటనలకు వస్తే చెట్లు కొట్టేయడం దగ్గర్నుంచి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీకటి పడితే బహిరంగంగా కనిపించేందుకు భయపడుతున్నారు. తాను అభ్యర్థులుగా కేటాయించిన వారిని తప్ప ఎవరిని కూడా దగ్గరకు రానివ్వడం లేదు.

అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏడు దాటితే చీకటికి భయపడుతున్నారు అంటే ఇక అధికారం లేకపోతే ఈయన తన ఇంటి నుంచి కాలు కూడా బయటకు పెట్టరేమో అన్న భావన అందరిలోనూ కలుగుతుంది. ఇలా చీకటి పడితే అంత భయపడే జగన్ అలాంటి దరిద్రమైనటువంటి పాలన ఎందుకు చేయాలి అంటూ పలువురు ఈయన పాలనపట్ల కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -