Raghurama Krishnamraju: ఆర్ఆర్ఆర్ గంజాయి మొక్క కాదు తులసి మొక్కే.. స్వయంగా పార్లమెంట్ చెప్పిందిగా!

Raghurama Krishnamraju: వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గత ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీకి దిగి గెలుపొందినటువంటి రఘురామకృష్ణం రాజు గెలిచిన కొద్ది రోజులకే వైసీపీకి వ్యతిరేకంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వైసీపీకి వ్యతిరేకంగా మారడంతో ఈయనని ప్రతి ఒక్కరు కూడా తులసి వనంలో గంజాయి మొక్క అంటూ విమర్శించేవారు కానీ ఆయన మాత్రం తాను గంజాయి మొక్క కాదు తులసి మొక్కే అంటూ చెప్పుకోవచ్చారు.

వైసిపి నుంచి 22 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటుకు వెళ్ళగా వారందరిలో కల్ల తానే ప్రత్యేకమని తెలిపారు. ఇకపోతే తాజాగా పార్ల‌మెంటు రికార్డులు.. ఆర్ ఆర్ ఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పార్ల‌మెంటుకు ఎన్నికైన 25 మంది ఎంపీల్లో ఆర్ ఆర్ ఆర్‌.. నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్నార‌ని.. పార్ల‌మెంటు స్ప‌ష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్లిన విషయంలోనూ రఘురామ కృష్ణంరాజు మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన 98% అటెండెన్స్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయ‌న కేవ‌లం రెండు సంద‌ర్భాల్లో మాత్ర‌మే స‌భ‌ల‌కు హాజ‌రు కాలేక పోయార‌ని తెలిపింది. ఇక ఈయన తర్వాత టిడిపికి రాజీనామా చేసినటువంటి ఎంపీ గల్లా జయదేవ్ 87 శాతంతో ఫ్రెండ్ స్థానంలో ఉన్నారు.

ఇక వైసీపీలో కీలక ఎంపీగా ఉన్నటువంటి నాయకుడు అవినాష్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి 42 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ 25 మందిలో చిట్టచివరి స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో గొడ్డేటి మాధవి నాలుగో స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఉన్నారు. అయితే రఘురామకృష్ణం రాజు మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించడంతో ఈయన నిబద్దత ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -