Raghurama Krishnamraju: ఉండి టికెట్ విషయంలో రఘురామ కృష్ణంరాజు ట్విస్ట్.. ఆ వార్తల్లో నిజం లేదా?

Raghurama Krishnamraju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పరిస్థితి ఎటు తేలని విధంగా ఉందని చెప్పాలి ఈయన అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గత ఎన్నికలలో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు అయితే గెలిచిన కొద్ది రోజులలోనే ఈయన వైసిపి పార్టీకి వ్యతిరేకంగా మారారు. అనంతరం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరినటువంటి రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు..

ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయనకు నరసాపురం నుంచే టికెట్ వస్తుందని ఆశించారు కానీ నరసాపురం నుంచి మాత్రమే కాకుండా ఈయనకు ఏ నియోజకవర్గంలోనూ టికెట్ రాకపోవడం గమనార్హం. ఇలా తనకు టికెట్ రాకపోవడంతో రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ నాకు టికెట్ రాకపోవడం వెనక కూడా జగన్ ప్రమేయం ఉందని తెలిపారు.

అయితే ఇటీవల ఓ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తాను ఎన్నికలలో పోటీ చేస్తానని గతంలో చెప్పాను అయితే ఉండి నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయబోతున్నారని అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి రామరాజును తొలగించి ఆయన స్థానంలో రఘురామకృష్ణం రాజును నియమిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆయనని తొలగించి ఉండి నియోజకవర్గంలో నాకు టికెట్ ఇచ్చినట్లు నాకైతే సమాచారం లేదని ఇదంతా అవాస్తవం అంటూ కొట్టి పారేశారు. అయితే తన పేరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు రాలేదు కానీ ఎన్నికల సమయానికి తాను ఎంపీగానా లేదా ఎమ్మెల్యే గానా పోటీ చేయడమైతే కచ్చితంగా ఉంటుందంటూ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇక పింఛన్ల పంపిణీ విషయం గురించి కూడా ఈయన స్పందించారు. గతంలో చనిపోని వృద్ధులు ఇప్పుడు సచివాలయం వెళ్లి పింఛన్ తెచ్చుకుంటే ఎందుకు చనిపోతున్నారంటూ ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -