Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్లూ టిక్ కోల్పోవడానికి కారణాలివే.. అక్కడే తప్పు చేశారా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటువంటి ట్విట్టర్ లో తన బ్లూటిక్ కోల్పోయారు. ఇలా ఈయన ట్విట్టర్ అకౌంట్ బ్లూటిక్ కోల్పోవడంతో ఒకసారిగా గందరగోల వాతావరణం ఏర్పడింది. ఇలా ఈయన బ్లూ టిక్ కోల్పోవడంతో ఎవరైనా ఈయన అకౌంట్ హ్యాక్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ బ్లూటిక్ కోల్పోవడం గురించి కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు ట్విట్టర్ వేదికగా చర్చించారు.రేవంత్ రెడ్డి త‌న ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో సాంకేతిక స‌మ‌స్య ఏర్పడి బ్లూటిక్ పోయినట్లు సీఎం సోష‌ల్ మీడియా అకౌంట్లు చూస్తున్న టీమ్ స్పష్టం చేసింది. మ‌రో రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్క్ తిరిగి వస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ప్లాట్‌ఫారమ్‌పై ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని తెలియజేశారు.

అయితే ఈయన బ్లూటిక్ తొలగిపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే కేవలం తన ప్రొఫైల్ ఫోటో మార్చడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడిచిన ఫొటోను పెట్టారు. అందుకే ఇలా బ్లూటిక్ కోల్పోయారని తెలుస్తుంది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -