Sharmila And Sunitha: షర్మిల ఎంపీగా పోటీ చేస్తే ఆమెకు వైఎస్ సునీత మద్దతు.. విజయాన్ని ఎవరూ ఆపలేరంటూ?

Sharmila And Sunitha: కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకూ మూడు జాబితాలను విడుదల చేసింది. తెలంగాణలో కూడా రెండు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. ఏపీ విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల్లో ఏపీలో పార్టీకి ఊపిరి పోయాలని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత అధిష్టానం చాలా సంతృప్తిగా ఉందని తెలుస్తోంది. అందుకే తక్కువ స్థానాల్లో పోటీ చేసినా.. ఈసారి ఏపీ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ఏపీ కాంగ్రెస్ ప్రాతినిథ్యం ఉండాలని హస్తం పార్టీ భావిస్తోంది. అందుకే… ఎక్కడ పోటీచేయాలి? ఎక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ ప్రభావం ఉంటందనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ గెలవకపోయినా… ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఉండాలని భావిస్తున్నారు. అందుకే షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి బరిలో దించాలని చూస్తున్నారు. షర్మిల ప్రభావం కడపలో ఎంత వరకూ ఉంటుంది? ఎన్ని ఓట్లు రాబడుతోందనే దానిపై స్థానికంగా సర్వేలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంకా ఏపీలో అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర చివరి రోజున కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ విషయంపైనే షర్మిలతో చర్చించినట్టు తెలుస్తోంది. కడప నుంచి లోక్‌సభకు పోటీచేయాలని సూచించారు. ఆమె కూడా సుముఖంగానే ఉన్నారు. అయితే, మరోసారి గెలుపు అవకాశాలను అంచనా వేసి ప్రకటించే అవకాశం ఉంది.

ఇందులో భాగంగానే కడప జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలలో షర్మిల భేటీ అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా? లేదా? అనే అంశంపై చర్చించారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనేదానిపై కూడా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైఎస్ సునీత, సౌభాగ్యమ్మ పూర్తిగా మద్దతు పలికితే గెలుపు ఖాయమనే అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేశారట. ఆ మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాదు.. విశాఖ స్ట్రీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని అభయం ఇచ్చారు. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటని నిలదీశారు. విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడైనా పార్లమెంట్‌లో ప్రశ్నిచారా అని అడిగారు. ఇలాంటి ఎంపీ ఉంటే ఎంత? ఉండకపోతే ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచైనా పోటీకి సిద్దం అని చెబుతూ కడప నుంచి పోటీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చర్చనడుస్తోంది. వివేకాహత్య కేసులో జగన్ తమకు న్యాయం చేయలేదని వైఎస్ సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే, వివేకాహత్య కేసు విచారణను జగన్ అడ్డుకుంటున్నారు. అందుకే ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని సునీత ప్రకటించారు. సునీత లేదా సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తారని స్థానికంగా ప్రచారం జరిగింది. నిజానికి సునీత లేదా సౌభాగ్యమ్మ పోటీకి చేయడానికి రెడీ అయ్యారు. కానీ, కడప ఎంపీగా పోటీ చేసి వారు ఎంతవరకూ ప్రభావం చూపుతారో అనే అనుమానాలు తలెత్తాయి. దీంతో.. షర్మిల కాంగ్రెస్ తరుఫున పోటీకి రెడీ అవుతున్నారు. షర్మిలకు మద్దతు ఇస్తే.. ప్రజాతీర్పు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. అందుకే సునీత, సౌభాగ్యమ్మ షర్మిలకు మద్దతించేందుకు సిద్దం అవుతున్నారు. ఎలాగైన అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా షర్మిలతోపాటు సునీత, సౌభాగ్యమ్మ పావులు కదుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -