Bandla Ganesh: ఎన్నికల కోసం బండ్లన్న భారీ ఏర్పాట్లు?

Bandla Ganesh: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బండ్ల గణేష్ ఎన్నో సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అలాగే పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు బండ్లన్న. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ ఇటీవలే తాను ఎఫ్ఎన్ సిసి ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా పాల్గొనబోతున్నాను అందరూ ఓటేసి గెలిపించండి అంటూ సోషల్ మీడియా లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇందుకోసం ముందస్తుగానే భారీ ఏర్పాట్లు చేసుకున్నారు బండ్ల గణేష్. ఎలా అయినా వైస్ ప్రెసిడెంట్ గా గెలవాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా బండ్ల గణేష్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎఫ్ఎన్ సిసి కీ ఎన్నికలలో పోటీ చేయడం కోసం ఇంత హడావిడి చేస్తున్నాడు. కాగా ఫిలింనగర్ కల్చర్ క్లబ్ లో ఒక 2000 మంది సభ్యులు ఉంటారు. ఆమాత్రం దానికి బండ్ల గణేష్ తెగ హడావిడి చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.

కాగా తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన మా ఎన్నికల సమయంలో కూడా తెగ హడావిడి చేస్తూ ఆ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికలు తలపించే విధంగా సందడి సందడి చేశారు. ఇది మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఇది జరిగిన కూడా ఇలాగే హడావిడి వాతావరణం ఎలా ఉంటుంది. ఆ హడావిడిలో సభ్యులు వందల వందలో ఉన్నా కూడా దాని ప్రభావం మాత్రం దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఎఫ్ఎన్ సిసి ఎలెక్షన్స్ కి మాత్రం కేవలం కటౌట్స్, ఫ్లెక్సీ లు తో ఫిలింనగర్ అంతా నింపి,సరిపెట్టేసారు. మా ఎలెక్షన్స్ లో మిస్ అయిన బండ్ల గణేష్ ఈసారి మాత్రం ఈ ఎఫ్ఎన్ సిసి కి జరుగుతున్న పోటీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా అయినా గెలవాలి అని గట్టిగానే కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి బండ్ల గణేష్ అనుకున్న విధంగా ఈ ఎఫ్ఎన్ సిసిఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా గెలుస్తాడో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -