Bandla Ganesh: తెలుగువాడిగా పుట్టడమే చంద్రబాబు చేసిన తప్పా.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

Bandla Ganesh: హైదరాబాదులో సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకి థాంక్స్ చెప్తూ ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు బోయపాటి శ్రీను, బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు. బండ్ల గణేష్ స్టేజి మీద మాట్లాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా, తనదైన రేంజిలో స్పీచ్ ఇరగదీశారు. చంద్రబాబుని ఏ తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేశారు..

సైబర్ టవర్స్ కట్టినందుకు హైదరాబాద్ కి సాఫ్ట్వేర్ తెచ్చినందుకు 400 ఏళ్ళు అయినా చంద్రబాబుని గుర్తుంచుకుంటారు. శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు, చంద్రబాబు దేవుడు, ఎక్కడికి వెళ్లినా ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు జై అంటున్నారు. కానీ చంద్రబాబుని రాజమండ్రి జైల్లో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆయన జైలులో ఉన్నారు అనే బాధతో నేను పండుగలు ఏవి సెలబ్రేట్ చేసుకోలేదు.

ఆయన రిలీజ్ అయిన తర్వాత దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను. చంద్రబాబు అనేది పేరు కాదు అది ఒక బ్రాండ్, బ్రాండ్ కూడా కాదు. మనిషి కూడా కాదు దేవుడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన వాళ్ళు దేశ విదేశాల్లో ఐటి ఉద్యోగాలతో బతుకుతున్నారంటే దాని వెనుక చంద్రబాబు కృషి ఉంది. చంద్రబాబుకి దేవుడు ఆశీర్వచనం ఇవ్వాలి చంద్రబాబు కోసం మా ప్రాణాలు ఇస్తాము.

సైబరాబాద్ లాగా ఏపీలోని అమరావతి గుంటూరు, రాజమండ్రిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు అనుకున్నారు అంటూ ఎంతో ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చారు బండ్ల గణేష్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గురించి ఆ రేంజ్ లో స్పీచ్ ఇచ్చే వారు బండ్ల గణేష్ కానీ మొదటిసారి చంద్రబాబు గురించి మాట్లాడేసరికి అందరూ ఫిదా అయిపోయారు. చాలామంది ఆ మాటలకి ఎమోషనల్ కూడా అయిపోయారు. ఇప్పుడు బండ్ల గణేష్ స్పీచ్ తెగ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -