Bandla Ganesh: ఆ పార్టీ నుంచి బండ్ల గణేష్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా?

Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. నటుడిగా నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు బండ్లగణేష్. గత ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ పార్టీ గెలుస్తుందని శభదాలు కూడా చేశారు. ఆ తర్వాత పార్టీ ఓడిపోవటం, బండ్లన్న సైలెంట్ కావటం చూశాం. తాజా మరోసారి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు బండన్న. మరి ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో చూద్దాం.

బండ్ల గణేష్ అంటే అతనొక ఫుల్‌టైమ్ సినిమా మనిషి. పార్ట్ టైమ్ పొలిటిషియన్ అనే పేరుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితులు అని అందరికి తెలుసు. కానీ 30 ఏళ్లకుపైగా తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న బండ్లగణేష్‌కి.. ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ మధ్యే రాజుకున్న ట్వీట్‌ వార్‌ అంతకంతకు పెరుగింది. ప్రస్తుతం మాత్రం సైలెంట్ అయ్యింది.

 

నటుడు బండ్ల గణేష్ కు పలు వ్యాపారాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కోళ్ల ఫామ్. ఇందులో బండ్లన్న బాగానే సంపాదించారనే టాక్ ఉంది. సినిమాలకన్నా వ్యాపారంలోనే డబ్బులు కూడబెట్టారని తెలిసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం, కరోనా మూడు సార్లు రావటం ఆయన్ని బాగా దెబ్బతీశారు. ఆ తర్వాత జ్ఞానోదయం అయిన వ్యక్తిగా పలు ఇంటర్య్వూలలో మాట్లాడారు. చింతచచ్చినా పులుపుచావదన్నట్టుగా… ఆయనలో రాజకీయ యావ మాత్రం తగ్గలేదు.

 

షాద్ నగర్ అడ్డాగా ఉంటున్న బండ్ల గణేష్ మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం కాదని పక్కాగా తెలుస్తోంది. మరి ఏ పార్టీ నుంచి బండ్లన్న దిగాతారనే వార్త మాత్రం తెగ చెక్కర్లు కొడుతోంది. ఆయన సన్నిహితుల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల గణేష్ రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మరి ఈ సారి అయినా బ్లేడ్ బండ్లన్న రాజకీయాల్లో రాణిస్తారా లేదా అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -