YS Jagan: కర్నూలు ప్రజలను పూల్స్ చేస్తున్న సీఎం జగన్.. ఆ హామీలపై నోరు కూడా మెదపలేదుగా!

YS Jagan: గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలులో 14కి 14 స్థానాలు వైసీపీయే గెలుచుకుంది. అయితే.. ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు. మెజార్టీ స్థానాలు టీడీపీ కూటమిలో పడే అవకాశం ఉందని సర్వలు చెబుతున్నాయి. అయితే, ఆ సర్వేలను నిజం చేసేలానే జగన్ ప్రచారం కూడా నడిచింది. మార్చి చివరిలో మూడు రోజులు జగన్ కర్నూలులో పర్యటించారు. 29, 30, 31న జగన్ కర్నూలులో పర్యటించి.. ఏప్రిల్ ఒకటిన కర్నూలు ప్రజలకు ఏప్రిల్ ఫూల్ చేసినట్టు వెళ్లిపోయారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే.. గత ఎన్నికల్లో జగన్ కర్నూలులో 18 రోజులు పర్యటించారు. ఏకంగా 260 కిలోమీటర్లు కవర్ చేశారు. కానీ, ఈ సారి మాత్రం కేవలం మూడు రోజుల్లో 14 గ్రామాలు, 46 కిలో మీటర్లు టచ్ చేసుకొని వెళ్లిపోయారు. ఎమ్మిగనూరు, నంద్యాలలో బహిరంగ సభలను నిర్వహించారు. జన సమీకరణ కోసం బీర్లు తాగించారు. బిర్యాని తినిపించారు. డబ్బు పంపిణీ చేశారు. ఇన్ని చేసినా.. బుస్సు యాత్ర తుస్సు మనిపోయింది. కొందరు వైసీపీ కార్యకర్తలు మినహ పెద్దగా జనం లేరు.

సిద్ధం సభలో జగన్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ముగించేశారు. కానీ.. కనీసం మేమంతా సిద్దం యాత్రలోనైనా ఏమైనా చెబుతారా అని ప్రజలు చూస్తున్నారు. కానీ, అదీ లేదు.. అదే పాచిపోయిన ప్రసంగంతో నెమ్మదిగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఎప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ పై విమర్శలు చేసేవారు. ఇప్పుడు వాటికి అదనంగా మా అభ్యర్థులు పేదవారు అంటూ రక్తి కట్టిస్తున్నారు. ఎక్కడిక్కడ అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని గెలిపించాలని కోరుతున్నారు. అదే సమయంలో పనిలో పనిగా మా అభ్యర్థులు పేదవారు అని చెబుతున్నారు. బస్సు యాత్రలో కొత్తగా ఏమైనా ఉందంటే అదే. మా అభ్యర్థులు పేదవారు.. కాబట్టి వారిని గెలిపించడానికి మీరంతా సిద్దమా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని గెలిపించడానికి ప్రజలను సిద్దమా? అని అడుగుతున్న జగన్.. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదు. కనీసం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకూ అమలు చేశామో కూడా చెప్పలేదు. కర్నూలులో న్యాయ రాజధాని కట్టేశామని ఇటీవల ప్రకటించారు. కర్నూలు కోసం జగన్ చేసిన మరో అద్భతం అది.

ఈ బస్సు యాత్రలో ప్రజల నుంచి, మేధావుల నుంచి సలహాలు తీసుకుంటామని మొదట చెప్పారు. కానీ.. అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. ముందుగా వైసీపీ ఎంపిక చేసిన వారు కొంతమంది వస్తున్నారు. వారే ముచ్చటిస్తున్నారు. అది కూడా వారి దగ్గర టోకెన్ ఉంటే లోపలికి పంపిస్తారు. లేకపోతే లేదు. అంతే.. అలాంటి సలహలు సూచనలు స్వీకరిస్తున్నారు. మరోవైపు ప్రతీ సభలోనూ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. కానీ, అక్కడ జగన్ చేసిందేమీ లేదు. ఓ బీసీ మంత్రికి, ఓ బీసీ ఎంపీకి టికెట్ కట్ చేశారు. ఇద్దరు ఎస్సీలు, ఓ మైనార్టీని పక్కన పెట్టారు. చాలా మందికి స్థాన చలనం కల్పించారు. కానీ, తన సమాజిక వర్గం నేతలను మాత్రం జగన్ టచ్ చేయలేదు. ఇదే జగన్ సామాజక న్యాయం. ఇలా మొత్తానికి ఎందుకు వచ్చామో.. ఏం చేస్తున్నామో అని వైసీపీ నాయకులకు, ప్రజలకు అర్థం కాని బస్సు యాత్ర జగన్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -