Kurnool City Review: కర్నూలు సిటీ రివ్యూ : టీజీ వెంకటేశ్ కొడుకు కర్నూలులో చక్రం తిప్పడం ఖాయమేనా?

Kurnool City Review: ఈసారి కర్నూలు ఎమ్మెల్యే స్థానం కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉండబోతుంది. ఇక్కడ నుంచి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు. కర్నూలు సిటీతో టీజీ ఫ్యామిలీకి విడదీయరాని బంధం ఉంది. 1999లో టీడీపీ తరపున పోటీ చేసి టీడీజీ భరత్ కర్నూలులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన పలు పార్టీలు మారారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ, ఆయన కొడుకు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2014లో కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ పోటీ చేసిన 3 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఆతర్వాత 2019లో ఆయన కొడుకు భరత్ పోటీ చేసి కేవలం ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాయలసీమలో గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా కేవలం 5 వేల ఓట్లు తేడాతోనే ఓడిపోయారు కాబట్టి.. ఈసారి గెలుపు పక్కా అని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు.. భరత్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆయన బలాన్ని పెంచుకున్నారు.

కర్నూలు నుంచి వైసీపీ మైనార్టీ నేత ఇంతియాజ్‌ను బరిలోకి దింపింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఉన్నారు. ఆయనకు స్థానిక నేత ఎస్వీ మోహన్‌రెడ్డితో విభేదాలు కారణంగా జగన్ కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. ఇంతియాజ్‌ ఐఏఎస్‌ అధికారి. కానీ, ఆయన్ని ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ ప్రజాక్షేత్రంలో పోటీకి నిలిపింది. కర్నూలులో మైనార్టీ ముస్లింలు ఎక్కువ అందుకు గత ఎన్నికల్లో ముస్లిం నేతను బరిలో దించి సక్సెస్ అయింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు కూడా అదే ఫార్ములా అమలు చేయడానికి ఇంతియాజ్‌ ను బరిలో దించింది. కేవలం పార్టీ బలంతోనే ఇంతియాజ్‌ కర్నూల్ లో అడుగుపెట్టారు. కానీ, ఆయనకు అక్కడ వైసీపీ నేతలు సహకరించడంలేదు. టికెట్ రాలేదు కనుక.. హఫీజ్ ఖాన్ వర్గం అంటీ ముట్టనట్లుగా ఉంటుంది. అటు, ఎస్వీ మోహన్ రెడ్డి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. రాజకీయాలు ఇంతియాజ్ కు కొత్త కావడంతో.. పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. సజ్జల రంగంలోకి దిగి.. అందరూ కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. కానీ.. సజ్జల మంత్రాంగం వర్క్ అవుట్ కావడం లేదు.

ముస్లింల తర్వాత ఇక్కడ ఎక్కవగా ఉన్నది ఎస్సీలు, వైశ్యులు. టీడీపీ అభ్యర్థి భరత్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అది ఆయనకు కలిసివచ్చే అంశం. పైగా ఆయన స్థానికుడు కావడంతో ప్రచారం ఈజీ అవుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనపై సింపతీ ఉంది. ఆ సింపతి ఇక్కడ కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏమాత్రం ఆయన అలసట చెందలేదు. ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు. నేను లోకల్ అనే స్లోగన్ తో ఆయన ప్రచారం చేస్తున్నారు. దీనికి వైసీపీ ఇంకా కౌంటర్ రెడీ చేసుకోలేదు. దీనికి తోడు యువకుడిని కావడంతో ఓ అవకాశం ఇవ్వాలని భరత్ కోరుతున్నాడు. మైనార్టీ ఓట్లు వైసీపీకి ఎక్కువగా వెళ్తాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి నెగెటివ్ అని ప్రచారం జరుగుతోంది. కానీ.. ముస్లిం మహిళలు బీజేపీ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారనే వాదన కూడా ఉంది. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలు బీజేపీ వైపు మారారని అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా.. టీజీ భరత్ మాత్రం ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీలో వర్గ విబేధాలు.. భరత్ పై సానుభూతి టీడీపీకి కలిసి వస్తుంది. దీంతోపాటు భరత్ చేసిన సేవా కార్యక్రమాలు కొంత కలిసి వస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -