Skill Development Scam: స్కిల్ కేసు సీబీఐకి ఇస్తే ముందుగా అరెస్టయ్యేది వాళ్లేనా.. జగన్ కు భారీ షాక్ అంటూ?

Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్ళించారనే ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడి నమోదు చేసిన కేసుని సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గంటా సుబ్బారావు, డాక్టర్ కే లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, అచ్చెంనాయుడు, చంద్రబాబు నాయుడు, సిబిఐ డైరెక్టర్, కేంద్ర హోమ్ కార్యదర్శి, తో సహా 44 మందికి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇది 371 కోట్ల డబ్బు అవకతవకలతో ముడిపడిన వ్యవహారమని ఎక్కువ రాష్ట్రాలతో ముడిపడి ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేస్తేనే రాజకీయ దురుద్దేశాలు ఆపాదించేందుకు తావు లేకుండా విచారణ సాగుతుందని తెలిపారు. కానీ సిబిఐ చేతుల్లోకి వెళితే సిఐడి విచారణ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడి నుంచి కాకుండా మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభిస్తారు. సిఐడి నమోదు చేసిన కేసుని ప్రామాణికంగా తీసుకుంటుంది.

క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేసిన వారిని, డబ్బులు రిలీజ్ చేసిన వారిని, నివేదికలు ఇచ్చిన వారిని ఇలా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. అలా జరిగినప్పుడు చంద్రబాబు వద్దకు కేసు వచ్చే ప్రస్నే లేదు. ఎందుకంటే కనీసం మనీ ట్రయల్ కానీ, ఆ కార్పొరేషన్ రోజువారి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా కానీ ఆధారాలు లేవు. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్తేనే ప్రభుత్వానికి మంచిదని, రాష్ట్రం దగ్గరే ఉంటే ప్రభుత్వం మారగానే కుట్రలు అన్ని వెలుగులోకి వస్తాయి.

అప్పుడు ముందుగా అరెస్టు అయ్యేది సజ్జల రెడ్డి, కొల్లి రెడ్డి ఇంకా వారి భజన గణం అంటున్నారు తెదేపా వర్గం వారు. అన్ని రకాల కుట్రలు చేసిన సిఐడి ఒక్క ఆధారం చూపకపోతే సీబీఐ మాత్రం ఎక్కడినుంచి తెస్తుంది. కానీ ఈ కేసు సిబిఐ చేతికంటూ వెళ్తే ముందుగా అరెస్టు అయ్యేది ప్రేమ చంద్రారెడ్డి, కల్లాం అజేయ రెడ్డి. సిఐడి వాళ్లు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. మరి సీబీఐ వాళ్ళు ఏమాత్రం కేసిన ముందుకు తీసుకువెళ్తారు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -