Nuvvu Naaku Nachav: నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఈ తప్పును మీరు గమనించారా.. ఏకంగా ఇంత పెద్ద తప్పు చేశారా?

తెలుగు ఇండస్ట్రీలో నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి ఉన్న వాల్యూ గురించి అందరికీ తెలిసిందే. ఒక సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆ సినిమా పేరు తలుచుకుంటే మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. వెంకటేష్ కెరీర్లో అతిపెద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమాలో ప్రతి పాటకి, ప్రతి డైలాగ్ కి ప్రతి క్యారెక్టర్ కి కూడా అభిమానులు ఉంటారు.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అంటే దానికి కారణం త్రివిక్రమ్ రాసిన మాటలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమాలో ప్రతి డైలాగ్ కి నవ్వుకుంటాము. ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా సినిమా అయ్యేవరకు చూస్తూనే ఉంటాము. మీమర్స్ కి ఈ సినిమా ఒక పెద్ద వరం. చాలా టెంప్లేట్లు ఈ సినిమావే వాడతారు. ఈ సినిమా లో వెంకీ మామ మొఖం చూస్తే చాలు మనకి నవ్వు ఆగదు.

అలాంటి సినిమాలో కూడా కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి అంటే నమ్ముతారా?. ఈమధ్య ఈ తప్పుని గమనించారు ప్రజలు. సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లిగా ఉన్న పింకీ తను 9వ తరగతి చదువుతుందని అది కూడా లిటిల్ ఫ్లవర్స్ లో అని చెప్తుంది. కానీ ఒక సీన్ లో తను ఉదయం స్కూల్ బస్సు ఎక్కేది మాత్రం బివిపివి స్కూల్ బస్సు.

దీన్ని ఈమధ్య గమనించిన ప్రేక్షకులు అంత పెద్ద సినిమా చేసి ఈ చిన్న తప్పుని ఎలాగా మిస్ అయ్యారు డైరెక్టర్ గారు అంటూ అడుగుతున్నారు. ఇప్పుడైతే ఇలా సోషల్ మీడియా వుంది కానీ ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కనుక ఈ తప్పు ఇలాగా ఉండిపోయింది. లేకపోతే పెద్ద హల్చల్ అవుదును. ఈ సంఘటన మీదగా మళ్లీ ఈ సినిమా న్యూస్ లో వెలుగులోకి వచ్చింది

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -