Abhay Ram: పెద్ద కొడుకు అలా చేయడంతో యంగ్ టైగర్ షాకయ్యారా?

Abhay Ram: నందమూరి ఇంట ఏ బిడ్డ అయినా నటన సహజాతంగా కలిగి పుడతాడు. ఇక ఉగ్గుపాలతో పాటే లోపల ఉన్న నైపుణ్యాలకు మెరుగులు పొందుతారు. అలనాడు అన్న గారు ఎన్టీఆర్ నుండి నేడు జూనియర్ ఎన్టీఆర్ వారసుల వరకు అదే చరిత్ర. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ హవా కొనసాగుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంట మరో నటసింహం బయటికి తప్పక వస్తుందని చర్చ మొదలైంది. ఇంతకీ ఆ చర్చకు కారణమేంటి మీరే చదవండి.

జూనియర్ ఎన్టీఆర్ 2011 సంవత్సరంలో లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఈ ముచ్చటైన జంటకు ఇద్దరు మగ బిడ్డలు సంతానం. వారే అభయ్ రామ్, భార్గవ రామ్. ఇక పెద్దవాడైన అభయ్ రామ్ యొక్క టాలెంట్ గురించే ప్రస్తుతం నడుస్తున్న చర్చ అంతా. బుడతడు మామూలోడు కాదు అంటూ అందర్నీ ఔరా అనిపిస్తున్నాడు అభయ్.

నాన్న కంటే స్పీడుగా స్టెప్పులు..
తారక్ పెద్ద కొడుకు అభయ్ రామ్ వయస్సు ప్రస్తుత కేవలం 8 సంవత్సరాలే. కానీ పాటలకు అభయ్ వేస్తున్న స్టెప్పులు మాత్రం అచ్చు నాన్న ను గుర్తు చేస్తున్నాయంట. కొడుకు అభయ్ డ్యాన్స్ చూసి తారక్ కూడా ఫిదా అయ్యారని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో తనదైన స్టెప్పులతో అద్భుతమైన పేరు గడించిన తారక్ కు.. డ్యాన్స్ విషయంలో అభయ్ రామ్ గట్టి పోటీ ఇస్తున్నారని బోగట్టా.

తారక్ ఏ స్పీడ్ ను తలదన్నేలా డ్యాన్స్ చేస్తున్న అభయ్ రామ్ ను చూసి యంగ్ టైగర్ మురుసిపోతున్నాడంట. మనోడి స్పీడ్ మాములుగా లేదని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీనితో తండ్రిని మించి పర్ఫామ్ చేయగల వారసుడు వచేసాడంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -