Andhrajyothy RK: మోదీపై విషం కక్కుతున్న ఆంధ్రజ్యోతి ఆర్కే.. ఆ కథనాల వెనుక కారణాలివేనా?

Andhrajyothy RK: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్తపలుకులో ఈ వారం ప్రధాని మోడీని చండశాసనుడిలా అభివర్ణించారు. అంతేకాదు.. రాజకీయ పెనుభూతంలాంటి వారని చెప్పుకొచ్చారు. ఆయన ఎందుకు మోడీని అంతలా వ్యతరేకించారు? టార్గెట్ చేసి మరీ రాయాల్సిన అవసరం ఏముంది? వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేకపోతే సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన అలా మోడీని వ్యతిరేకించడానికి ఉన్న కారణం ఏంటి అనేది పక్కన పెడితే, ఇక్కడ రెండు విషయాలు మాత్రం క్లియర్ గా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో కథనాలు మొదటి నుంచి మోడీ పాలసీలను వ్యతిరేకిస్తూనే ఉంటాయి. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి వార్తలు టీడీపీకి అనుకూలంగా ఉన్నా.. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టే ఉండేవి.

ఇక రెండో విషయానికి వస్తే.. ఆర్కే చెప్పినట్టు మోడీని వ్యతిరేకించిన వారు బ్రతికి బట్టకట్టినట్టు గత పదేళ్ల భారత రాజకీయాల్లో లేదు. అలా అని మోడీతో సఖ్యతగా ఉన్నవారు తప్పించుకున్న దాఖలాలు లేవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగరాలి. దాని కోసం ఏమైనా చేయాలి. సామదానభేదదండోపాయాలు ప్రయోగిస్తారు. ఒక రాష్ట్రంపై కన్ను పడితే ఆ రాష్ట్రాన్ని అస్త్రగతం చేసుకోవాల్సిందే. ఇదే టార్గెట్ గా మోడీ, అమిత్ షా ద్వయం దూసుకుపోతున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఎవరితో విభేదించిన చివరి లక్ష్యం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశవ్యాప్తంగా కాషాయి జెండా ఎగరాలి. ఈ క్రమంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని రాష్ట్రాన్ని ఏలుతారు. ఎదురుతిరిగిన పార్టీలను తొక్కిపెట్టి ఆగ్రమించుకుంటారు. అక్కడితో ఆగితే కొంత సంతోషమే. కలిసివచ్చే పార్టీలను కూడా సమయం చూసి వేటు వేసి ఆ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తారు.

మోడీని ఎదురించిన పార్టీ పరిస్థితిని ఓసారి చూస్తే…2019 ముందు చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించి జాతీయ స్థాయిలో కూటమిని కట్టారు. ఆ ఎన్నికల్లో బీజేపీ.. వైసీపీకి పరోక్షంగా సాయం చేసి చంద్రబాబును ఓడించింది. 2019 తర్వాత టీడీపీ పరిస్థితి ఎంత దయానీంగా మారిందో అందరికీ తెలిసిందే. ఇక, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సివిల్ సర్వెంట్ గా ఉన్నంత వరకూ ఆయనకు అవినీతి మరకలు అంటలేదు. అంతేకాదు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరిమితం అయినంత వరకూ బీజేపీ ఆయన్ని టచ్ చేయలేదు. కానీ.. ఢిల్లీని దాటుకొని పంజాబ్, గోవాలో విస్తరించాలనే ప్రయత్నాలు చేసినప్పటి నుంచి ఆయన్ని అవినీతిపరుడుగా చిత్రీకరించారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపెట్టుకొని ఎదిగిన బీజేపీ.. గత ఎన్నికల తర్వాత శివసేన అధినేత సీఎం పదవి అడగటంతో ఆ పార్టీతో బీజేపీ తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత శివసేనను చీల్చీ ఉద్దవ్ ఠాక్రేను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్సీపీ కూడా బలంగా ఉంటే ప్రమాదం అని భావించి ఆ పార్టీని కూడా చీల్చి.. చివరికి శరద్ పవార్ కు పార్టీ గుర్తు కూడా లేకుండా మోడీ వ్యూహాలను రచించి సక్సెస్ అయ్యారు.

ఇక బీజేపీతో పొత్తుపెట్టుకొని చెడ్డ పార్టీలు విషయానికి వస్తే.. బీహార్‌లో జేడీయూ ఇప్పుడు ఉనికిని కోల్పోతుంది. 2010లో 115 అసెంబ్లీ స్థానాలు ఉన్న జేడీయూకి ఈ రోజు కేవలం 43 స్థానాలు మాత్రమే ఉన్నాయి. దానికి కారణం బీజేపీతో పొత్తు. ఏ పార్టీలతో అయితే పొత్తు పెట్టుకుంటాయో ఆ పార్టీలను నెమ్మదిగా బలహీనం చేసి.. చివరికి ఆ పార్టీని హైజాక్ చేయడం మోడీ లక్షణం. ఇక కర్నాటకలో జేడీఎస్ పరిస్తితి కూడా అంతే. 2004లో ఆ పార్టీకి 58 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని చివరికి ఆ పార్టీ గతేడాది జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలకు పరిమితం అయ్యింది. మహారాష్ట్రలో శివసేన పరిస్థితి కూడా అంతే. ఇలా బీజేపీతో మరీ దగ్గరగా అంటకాగినా.. ఆ పార్టీలకు నూకలు చెల్లినట్టే.

అందుకే.. బీజేపీతో పొత్తులేకుండా విభేదాలు లేకుండా ఉండాలి. రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఎవరి పనులు వారు చేసుకొని.. కేంద్రంలో బీజేపీకి సపోర్టు చేసేలా ఉండాలి. ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రమే ఆ ఫార్ములాను అమలు చేశారు. కాబట్టి రాజకీయంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. జగన్ పై ఎన్ని కేసులు ఉన్నా.. ఆయన్ని సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు టచ్ చేయలేదు. అంతేకాదు.. మొన్నటికి మొన్న చిలకలూరి పేట బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోడీ.. జగన్ ను పన్నెత్తి మాట్లాడలేదు. ఇలాంటి బీజేపీతో టీడీపీకి ప్రమాదం అని మొదటి నుంచి ఏబీఎన్ ఆర్కే చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -