Actor Banarjee: బెనర్జీపై మోహన్‌బాబు చేయి ఎత్తడానికి కారణం అదే!

Actor Banarjee: ప్రతి రంగంలో చిన్న చిన్న తప్పిదాలు, గొడవలు సహాజమే. మొదట గొడవపడి ఆ తర్వాత అందరు కలిసిపోతారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగ సినమా రంగంలో జరుగుతుంటాయి. గతేడాది, మూవీ ఆర్టిస్ట్‌కు జరిగిన అసోసియేషన్‌ ఎన్నికల్లో జరిగిన రచ్చ చూస్తే రాజకీయల్లో జరిగినంతా జరిగింది. ప్రకాశ్‌ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు పోటీలోకి దిగగా హోరాహోరీలో విష్ణు ప్యానెల్‌ విజయం సాధించగా ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు చేపట్టాడు.

ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఆ ఎన్నికల సమయంలో జరిగిన పలు విషయాలపై సీనియర్‌ నటుడు బెనర్జీ తాజాగా నోరు విప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్లో పసారమయ్యే ఓ కార్యక్రమానికి గెస్ట్‌గా బెనర్జీ వచ్చి ఆయన గురించి ఇంత వరకు ఎవ్వరికీ తెలియని పలు విషయాలు షేర్‌ చేశారు. మోహన్‌ బాబు మీపై చేయి చేసుకున్నారంట కదా అని అడగ్గా.. కళ్లు తుడుచుకుంటూ బెనర్జీ కాస్త ఎమోషనల్‌ అవుతూ.. మోహన్‌ బాబు విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేశానని సమాధానం ఇచ్చారు.

గతంలో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్న తనీష్‌ని మోహన్‌ బాబు తిట్టారు. ఆ టైమ్‌లో నేనను అక్కడికి వెళ్లి, గొడవలొద్దని విష్ణుతో చెబుతుండగా అక్కడికి వచ్చిన వెంటనే మోహన్‌ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు. అరగంట పాటు బూతులు తిడుతూనే ఉండటంతో ఏం చెప్పాలో అర్థం కాక షాక్‌లో ఉండిపోయాను అని అప్పట్లో మీడియా ముందు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు.

మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారని అడగ్గా.. తాను డైరెక్టర్‌ అవుదామని వచ్చానని.. కానీ అమితాబ్‌ బచ్చన్‌ సినిమాకు పనిచేస్తున్న సమయంలో ఓ కన్నడ నటుడు రాకపోవడంతో సీన్స్‌ అన్ని నేనే చేశానని అప్పటి నుంచి నటుడిగానే ఉండిపోయాయని తన మనసులో మాటను బెజర్జీ వివరించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -