Nagarjuna: విజయవాడ ఎంపీ స్థానానికి నాగార్జున?

Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు అక్కినేని నాగేశ్వరావు కొడుకు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. నాగార్జున దాదాపు 100 సినిమాలకు పైగా నటించి నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగ్ నటుడుగా నిర్మాతగా కలిపి 9 నంది అవార్డులను తన సొంతం చేసుకున్నాడు.

మొత్తానికి నాగార్జున తెలుగు నాట నటుడుగా తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు. నాగార్జున సినిమాల పరంగానే కాకుండా పలు బిజినెస్ రంగాలను కూడా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. చాలా బిజినెస్ లకు నాగార్జున ఇన్వెస్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇలా పలు విధాలుగా నాగార్జున దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే నాగార్జున గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున విజయవాడ నుంచి వైయస్ఆర్సీపీ తరఫున లోక్ భకు పోటీ చేయవచ్చు అనే పుకార్లు తెగ జరుగుతున్నాయి. ఈ విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగార్జున పేరు తెగ హడావిడి చేస్తుంది. నిజానికి నాగార్జున వైయస్ జగన్ తో బాగా సన్నిహితంగా ఉంటాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

కాగా ఈ విషయం గురించి నాగార్జున సన్నిహితులను అడిగి తెలుసుకోగా.. ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు.. ఆయన రారు. ఎవరో కావాలనే ఈ వార్తలు పుట్టిస్తున్నారు అని తెలిపారు. ఏదేమైనా విజయవాడ ఎంపీ స్థానాన్ని వైసీపీ దక్కించుకోవడానికి ఒక స్టార్ హీరోని బరిలోకి దించడానికి చూస్తున్నాడట వైఎస్ జగన్. మరి ఈ విషయంలో నిజం ఎంత అన్నది తెలియదు.

అంతేకాకుండా ఈ విషయం గురించి నాగార్జున స్పందించే వరకు వేచి చూడాల్సి ఉంది. ఇక నాగార్జున రాబోయే సినిమాల విషయానికొస్తే ద గోస్ట్. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా అక్టోబర్ ఐదు న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా అగ్నివర్షం ఈ సినిమాకు అర్జున్ సజనాని దర్శకత్వం ఇస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -