Vellampalli Srinivas: నువ్వు కట్టేయ్.. నేను చూసుకుంటాను.. ఏపీలో వెల్లంపల్లి అక్రమాలకు అడ్డూ అదుపు లేదా?

Vellampalli Srinivas: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డుగోలు పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చేతికి దొరికినది దాచుకుంటూ భారీ స్థాయిలో అవినీతి చేస్తున్నారు ఒకప్పుడు ఇబ్బంది అనిపించినది ఇప్పుడు వైసీపీ నేతలకు ముద్దుగా మారిందని తెలుస్తోంది. పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారు. తాజాగా విజయవాడలో కూడా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వైసిపి నాయకులు మాత్రం వారికి అనుగుణంగా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు.

గతంలో వద్దని చెప్పి కూల్చివేసినటువంటి దుకాణాలను రాత్రికి రాత్రే పున ప్రారంభించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఘటన విజయవాడలోని మధురానగర్ లో చోటుచేసుకుంది. మధుర నగర్ వంతెన పై పక్కన పెద్ద ఎత్తున దుకాణాలను నిర్మాణం చేపట్టారు. అయితే గతంలో ఇక్కడ దుకాణాలు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు ఈ దుకాణ గోడలను కూల్చివేశారు.

ఈ విధంగా దుకాణాలను కూల్చివేయడంతో అప్పుడు ప్రత్యామ్నాయంగా కేవలం పరదాలు కప్పి అలాగే ఉంచారు. అయితే తాజాగా ఇక్కడ వైసిపి ఇన్చార్జిగా మరొకరు నియమింపబడ్డారు..దీంతో అక్రమ నిర్మాణాలకు ప్రాణం పోసినట్టయింది. నువ్వు కట్టేయ్ అంత నేను చూసుకుంటాను అనే విధంగా ఇక్కడ వైసిపి ఇన్చార్జ్ వ్యవహరిస్తున్నారు. ఇలా కొత్త ఇన్చార్జి రాగానే గతంలో కూల్చివేసినటువంటి గోడలను తిరిగి రాత్రికి రాత్రే ప్రారంభించారు దీంతో నగరవాసులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఒకప్పుడు అడ్డమైనటువంటి ఈ దుకాణాలు తిరిగి ప్రారంభం కావడంతో ఇదంతా వెల్లంపల్లి మహత్వం అంటూ గుసగుసలాడుతున్నారు. ఈ వంతెన పక్కన రెండు సర్వీస్ రోడ్లు ఉన్నాయి అలాగే పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే ఇబ్బంది కలగగా ఈ దుకాణాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం మరింత రద్దీగా మారుతుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -