Vijayawada: పింఛ‌ను సొమ్ముతో ఉద్యోగి ప‌రార్‌.. వైసీపీ దరిద్రం మామూలుగా లేదుగా!

Vijayawada: ప్ర‌స్తుతం ఏపీలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారిన విష‌యం తెలిసిందే. పింఛన్లను ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడింది అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయగా టిడిపి మాత్రం వైసిపి డబ్బులు ఆలస్యంగా ఇస్తూ తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఈ విధంగా పింఛన్ల విషయంలో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా బ్యాంకు నుంచి పెన్షన్ సొమ్మును డ్రా చేసుకున్నటువంటి ఓ ఉద్యోగి పెన్షన్ డబ్బుతో పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై కూడా రెండు పార్టీల మధ్య రాజకీయం మొదలవడం గమనార్హం. వాలంటీర్లు పింఛన్ ఇవ్వడానికి వీలు లేదంటూ ఎన్నికల కమిషన్ చెప్పడంతో సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతను అప్పజెప్పారు. దీంతో పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే విజ‌య‌వాడ, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన స‌చివాల‌య ఉద్యోగి నాగ మ‌ల్లేశ్వ‌ర‌రావు.. శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకుకు వెళ్లి సొమ్ము డ్రా చేశారు అయితే ఆ డబ్బు తీసుకున్నటువంటి ఆయన లబ్ధిదారులకు ఇవ్వకుండా అటు నుంచి అటే పరారై వెళ్లిపోయారు. ఎంతసేపటికి మల్లేశ్వర రావు రాకపోవడంతో పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడమే కాకుండా బ్యాంకుకు వెళ్లి తనకి చేయడంతో డబ్బు డ్రా చేశారని అధికారులు చెప్పారు.

ఇలా పెన్షన్ డబ్బుతో పరారు కావడంతో ఈ విషయాన్ని కూడా వైసిపి రాజకీయం చేస్తుంది డబ్బుతో పరార్ అయినటువంటి మల్లేశ్వర రావు టిడిపి అభ్యర్థినే ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్ర చేశారని ఈ కుట్ర వెనుక బాబు ఉన్నారంటూ నేతలు మండిపడుతున్నారు కానీ ఈ విషయాన్ని టిడిపి వారు తిప్పి కొడుతున్నారు. ఆ పెన్షన్ దొంగలించినటువంటి మల్లేశ్వర రావు సోదరుడు వైసిపి నాయకుడని, దీంతో తనని ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యంతోనే పెన్షన్ డబ్బులు కాజేశారు అంటూ టిడిపి వాళ్లు కూడా వైసీపీని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -