Loan Default Case: అప్పుల పాలైన స్టార్ హీరో.. తీర్చలేకనే ఆ పని చేస్తున్నాడా?

Loan Default Case: ఏపీకి చెందిన విశాల్ తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ సినీ నటుడ సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుని అక్కడే సెటిల్ అయిపోయాడు. తెలుగు వ్యక్తి అయిన విశాల్ తమిళ ఇండస్ట్రీలో సత్తా చాటుతూనే ఉన్నాడు. అక్కడ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

అయితే హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా విశాల్ పలు సినిమాలు తీశాడు. అయితే కొన్ని సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఆర్ధికంగా నష్టపోయాడు. వీరమే వాగై సూడుమ్ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ దగ్గర విశాల్ రూ.21 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. కానీ అప్పు తీర్చకపోవడంతో లైకా కోర్టును ఆశ్రయించింది. 6 నెల్లోగా రూ.15 కోట్లు చెల్లించాలని విశాల్ ను ఆదేశించింది. అయినా విశాల్ కట్టకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తాజాగా విశాల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు.

ఈ సందర్భంగా తనకు ఒక్కరోజులో రూ.18 కోట్ల నష్టం వచ్చిందని, ఇంకో 6 నెలలు టైమ్ ఇచ్చినా అప్పు తీర్చలేనని విశాల్ కోర్టుకు తెలిపాడు. తాను అప్పులు కట్టడానికే సినిమాలు చేస్తున్నానని, సినిమాలు విడుదల చేద్దామనుకున్న ప్రతిసారి లైకా ప్రొడక్షనస్ కోర్టుకు తీసుకువస్తుందని తెలిపాడు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని తెలిపాడు. దీంతో సెప్టెంబర్ 9లోగా ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించాలని విశాల్ ను కోర్టు ఆదేశించింది.

లైకా ప్రొడక్షన్స్ తరపు లాయర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం విశాల్ చాలా సినిమాలు చేస్తున్నాడని, అప్పులు కట్టలేని పరిస్ధితుల్లో లేడని చెప్పాడు. విశాల్ మంచి సినిమాలు చేస్తున్నాడని, ఆస్తులు కూడా ఎక్కువా ఉన్నాయని తెలిపాడు. కావాలనే విశాల్ డబ్బులు కట్టకూండా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ను ఇబ్బంది పెడుతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ చెప్పాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -