Vishal: కోలీవుడ్ స్టార్ హీరో కూతురితో విశాల్ రొమాన్స్.. అందుకే పెళ్లి క్యాన్సిల్ అయిందా

Vishal: తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రంలో జన్మించిన విశాల్ తమిళ భాషలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తమిళ మాత్రమే కాకుండా తెలుగులో కూడా నటించి అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అందరి హీరోల మాదిరిగానే విశాల్ గురించి కూడా ఎన్నో రూమర్లు వినిపించాయి.

గతంలో ఒక తెలుగు అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న విశాల్ కొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందని నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడు. అయితే ఇలా విశాల్ పెళ్లి రద్దు కావటానికి ముఖ్య కారణం కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అని తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. విశాల్, వరలక్ష్మి జంటగా ” మ‌ర‌గ‌ద‌రాజ “‌అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఆ తర్వాత వీరిద్దరూ కూడా ఎక్కడైనా జంటగానే దర్శనమిచ్చేవారు. అంతే కాకుండా ఇద్దరు కూడా ఎన్నో సార్లు రహస్యంగా కలుసుకునేవారని వార్తలు వినిపించాయి. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ వల్ల విశాల్ పెళ్ళి రద్దు అయినట్టు తెలుస్తోంది.

ఇక వీరి మధ్య ఉన్న బంధం గురించి మీడియా వర్గాలు ప్రశ్నించగా… మేమిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విశాల్ తమిళ్ భాషలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ అటు తమిళ్, ఇటు తెలుగు సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తు బిజిగా ఉంది.ఇక ఈమె తెలుగులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకులకు జయమ్మ పాత్రలో పరిచయమయ్యారు. ఈ పాత్రతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ వరుస సినిమాలలో అవకాశాలను అందుకుని బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -