Radhika Sarathkumar: పుట్టినరోజు వేడుకలకు భార్యతో కలిసి హాజరైన సూర్య!

Radhika Sarathkumar: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నటి రాధిక శరత్ కుమార్. ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ అగ్ర హీరోలు అందరి సరసన ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు అగ్ర హీరోయిన్ గా ఓవెలుగు వెలిగిన రాధిక ఇప్పటికీ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు.

ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో మంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. బుల్లితెర యాంకర్ గాను అలాగే బుల్లితెర సీరియల్స్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇలా ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్న రాధిక తాజాగా నేడు 60వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంది.

రాధిక ఆగస్టు 21వ తేదీ తన 60పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాధిక 60 పుట్టిన రోజు కావడంతో మిడ్ నైట్ తన కుటుంబ సభ్యులు తనతో కేక్ కట్ చేయించి బర్తడే సెలబ్రేట్ చేశారు.అయితే ఈ బర్తడే సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యి పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తన స్నేహితులు అయినటువంటి నటి రమ్యకృష్ణ, కుష్బూ, మీనా, వంటి ఇతర హీరోయిన్లు హాజరయ్యి పెద్ద ఎత్తున ఈమె పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. అదేవిధంగా మొదటిసారి కోలీవుడ్ నటుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి రాధిక పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -