Ambani Daughter in Law: అంబాని కోడలు హ్యాండ్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ambani Daughter in Law: ప్రపంచ ధనికులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన భార్య నీతా అంబానీ గురించి కూడా మనందరికీ తెలిసిందే.

ఆమె ప్రస్తుతం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం తాజాగా గ్రాండ్ గా మొదలయ్యింది. ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

 

ఇకపోతే ఈ వేడుకలో ముకేశ్ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవానికి హాజరు కాగా, ఇద్దరు నల్లని రంగు దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే ఆ కార్యక్రమానికి వచ్చిన అందరి చూపులు రాధిక చేతిలో ఉన్న మినీ హ్యాండ్ బ్యాగ్ పై పడింది.

 

రాధిక చేతిలో ఉన్న ఆ చిన్న బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్న మినీ బ్యాగ్ చాలా ఖరీదైందని నెట్టింట్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ మినీ బ్యాగ్ ఖరీదు గురించి తెలిపింది కామ్‌ అనే వెబ్‌సైట్‌. రాధిక చేతిలో ఉన్న ఆ మినీ బ్యాగ్ దాదాపు రూ.52 లక్షలు ఖరీదు చేస్తుందని తెలిపింది. అనగా అరకోటి అన్నమాట. సిల్వర్‌ రంగులో ఉన్న ఈ హెర్మిస్‌ కెల్లీమోర్ఫోస్‌ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి.

 

ఈ బ్యాగ్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చాలామంది ఆ చిన్న హ్యాండ్ బాగ్ ఖరీదు తెలిసి నోరెళ్ళ పెడుతున్నారు. వామ్మో ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అన్ని లక్షలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -