Sreeleela: తప్పు చేస్తున్నానని తెలుసు కానీ తప్పక చేస్తున్నాను.. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు వైరల్!

Sreeleela: శ్రీ లీల, శ్రీ లీల, శ్రీ లీల టాలీవుడ్ లో ఇదొక రామనామ జపం అయిపోయింది. ఎవరి నోట విన్న ఇదే పేరు, ఏ సినిమాలో చూసినా ఈమె హీరోయిన్. తను ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా వైరల్ అయిపోతుంది. అలా తను మాట్లాడిన ఒక టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. తప్పు చేస్తున్నానని తెలుసు కానీ తప్పక చేస్తున్నాను అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది ఇంతకీ ఏం జరిగిందంటే..

శ్రీ లీల తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా శ్రీలీల కీలక రోల్ పోషిస్తుంది. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.

తాను డాక్టర్ ఎందుకు చదవాలి అనుకున్నాను అనేదానికి క్లారిటీ ఇస్తూ ఒక రోజు అమ్మమ్మ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది అంట.. అయితే అందరిలాగే తాను కూడా నిస్సహాయంగా చూస్తూ ఉన్నానని కానీ మా బ్రదర్ డాక్టర్ కావడంతో వెంటనే వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారని, అప్పుడే డాక్టర్ అవ్వాలని గట్టిగా డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది శ్రీ లీల. సినిమాల్లో నటిస్తూ డాక్టర్ చదవడం అనేది చాలా చాలా కష్టం.

మార్నింగ్ షూటింగ్స్ చేసుకొని రాత్రుళ్ళు చదువుకుంటూనే ఉంటాను. కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇష్టంతో చేసిన కష్టం, కష్టంగా అనిపించదు. ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు ఆ బాధ తెలియడం లేదు. కొన్నిసార్లు ఇది తప్పు అని తెలుసు కానీ తప్పక చేయవలసి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఏది ఏమైనా ఈమె హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -