Sreeleela: అలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్న శ్రీలీల.. పెళ్లి చేసుకున్న వాడికి కష్టమే అంటూ?

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల హవా కొనసాగుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోలు సరసన నటిస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది. ఇప్పటికీ ఇంకా ఆమె చేతిలో పది ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. స్టార్ హీరోయిన్ ని మించిన రేంజ్ లో ఆమె హవా కొనసాగుతుంది. దీంతో ఆమెకు ప్రతి చిన్న విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

అందులో భాగంగానే శ్రీ లీల కి సంబంధించిన టాపిక్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఆమెకి ఒక భయంకరమైన జబ్బు ఉందని, ఆ జబ్బుతో శ్రీ లీల తెగ బాధపడుతుందని అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. ఇంతకీ ఆమెకి ఉన్న జబ్బు ఏమిటంటే చలిగాలి తగిలిందంటే తుమ్ములు వరసగా వచ్చేస్తాయంట, పది పదిహేను తుమ్ములు గ్యాప్ లేకుండా వస్తాయంట. అయితే ఈ విషయాన్ని శ్రీ లీల కూడా ధమాకా సినిమా టైంలో కన్ఫామ్ చేసింది.

తనకి ఈ జబ్బు ఎప్పుడూ ఎలా వచ్చిందో తెలియదని, తనకి ఊహ తెలిసిన నాటి నుంచి తనకి ఈ జబ్బు ఉందని చెప్పుకొచ్చింది. అయితే దీనికోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏమీ తీసుకోవటం లేదని చెప్పుకొచ్చింది ఈ భామ. ఆమె సంగతి పక్కన పెడితే ఆమెకి ఇలాంటి వ్యాధి ఉందని ఆమె అభిమానులు మాత్రం తెగ బాధ పడిపోతున్నారు. పెళ్లి చేసుకునే వాడికి కష్టమే అంటూ వాపోతున్నారు. ఇక ఈమె సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో చాలా బిజీగా గడుపుతుంది ఈ భామ.

మొన్న జరిగిన భగవంతు కేసరి ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఈవెంట్లో బాలకృష్ణ తనకి తండ్రి లేని లోటు తీర్చాడంటూ బాగా ఎమోషనల్ అయింది. బాలకృష్ణ కూడా ఆమె గురించి చాలా బాగా మాట్లాడాడు. ఈ సినిమాలో నాకు కూతురుగా నటించింది కానీ వచ్చే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంటే తన కొడుకు తనని కోప్పడ్డాడంటూ చాలా జోవియల్ గా మాట్లాడాడు బాలకృష్ణ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -