Actress Vijayashanthi: నా బ్యాచ్ హీరోలందరూ ముసుగు దొంగలు.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

Actress Vijayashanthi: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి నటి విజయశాంతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పలు ఇండస్ట్రీలో దాదాపు 180 సినిమాలకు పైగా విజయశాంతి నటించి నటనలో తనకంటూ చరగని ముద్ర సంపాదించుకుంది. అప్పట్లో విజయశాంతి కర్తవ్యం సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పట్లో విజయశాంతి పోలీస్ వేషంలో నిజంగానే పోలీస్ ఏమో అని అనిపించే విధంగా తన పాత్రను పండించేది.

అలా టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి, సహాయ పాత్రలు కూడా చేసి తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక విజయశాంతి ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంలో కూడా అడుగుపెట్టి రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదట విజయశాంతి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది. తర్వాత ఆమె వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని టీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది.

ఇక విజయశాంతి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో చేస్తున్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందట. మీరు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే దానికి తెలంగాణ ప్రజలే కారణం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి? తెలంగాణకు అన్యాయం జరగడంలో మీ అభిప్రాయం చెప్పండి అంటే.. ఒక్క హీరో కూడా సమాధానం చెప్పలేదు. ఇక మీ బ్యాచ్ హీరోలు భయపడ్డారా అని ఒక యాంకర్ అడగగా కాదు మా బ్యాచ్ హీరోలంతా ముసుగు దొంగలు.

ఎందుకంటే వాళ్లు తీసుకుంటున్న పారితోషకంలో 50 శాతం లో కనీసం 20 శాతం కూడా ప్రజల కోసం ఖర్చు చేయడం లేదని వాళ్లు కేవలం సినిమాలోని హీరోలా.. బయట కాదా అని అడిగిందట. కనీసం దండేసి అభినందించడానికి ఒక హీరో కూడా లేడా.. అని విజయశాంతి అప్పట్లో అడిగిందట. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమా భారీ స్థాయిలో విజయం సాధించిన తర్వాత కూడా తను సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చానని ఆ ఇంటర్వ్యూలో విజయశాంతి తెలుగు హీరోలపై కొంచెం ధీటుగానే మాట్లాడింది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -