Heroines: నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టిన ఈ స్టార్ హీరోయిన్స్ కు నిరాశ మిగిలిందా!

Heroines: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు నటనకు మాత్రమే పరిమితం అయితే మరికొందరు నటనతో పాటు సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. మనకు ఇష్టమైన హీరోయిన్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమాల గురించి చూసేద్దాం.

మంజుల: షో అనే సినిమాను నిర్మించి మంచి విజయం సాధించారు. తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాకు నిర్మాతగా వ్యవహరించి కమర్షియల్ విజయం సాధించడం జరిగింది.

శ్రీదేవి: ఈ హీరోయిన్ తన భర్తతో కలిసి దాదాపుగా నిర్మించిన సినిమాలు అన్ని పరాజయం కావడంతో చివరికి ప్రొడక్షన్ ని ఆపేశారు. చాలా ఆస్తులు కోల్పోవడం జరిగింది.

సావిత్రి: తన భర్తతో కలిసి చిన్నారి పాపలు అనే సినిమా నిర్మించడం జరిగింది. సినిమా అనుకున్నంత రీతిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ఈ ఒక్క సినిమాతోనే భారీగా ఆస్తి కోల్పోయినట్లు తెలుస్తుంది.

జయసుధ: ఈమె కలికాలం, అదృష్టం, వింత కోడలు చిత్రాల ద్వారా చాలా నష్టాన్ని చవిచూడడం జరిగింది. తర్వాత ప్రొడక్షన్ ను ఆపేశారు.

విజయశాంతి: ఈమె నిప్పురవ్వ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా చేయడం జరిగింది. సినిమా భారీగా పరాజయం కావడంతో ఈమె కూడా ప్రొడక్షన్ ను ఆపేయడం జరిగింది.

భూమిక చావ్లా: ఈ బ్యూటీ కూడా తకిట తకిట అనే సినిమాను నిర్మించడం జరిగింది. చివరికి చాలా నష్టం రావడంతో ఈమె కూడా ప్రొడక్షన్ ను ఆపేయడం జరిగింది.

కళ్యాణి: ఈమె K2K అనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మించిన మొదటి సినిమానే భారీ పరాజయం కావడంతో ఇక ప్రొడక్షన్ ను మూసివేశారు.

రోజా: ఈమె తన భర్తతో కలిసి తమిళంలో చాలా సినిమాలను నిర్మించడం జరిగింది. ఎక్కువ సినిమాలు పరాజయం కావడంతో ఈమె భర్త డైరెక్షన్ ను వదిలేశారు. ఈమె ప్రొడక్షన్ ను వదిలేయడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -