Vijayashanti: టాలీవుడ్ స్టార్ హీరోలంతా ముసుగు దొంగలే.. విజయశాంతి కామెంట్స్ వైరల్!

Vijayashanti: వెండితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈమె హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ లేడీ అమితాబ్ అనే పేరు సంపాదించుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి అగ్ర హీరోలు అందరి సరసన నటించారు.

ఇక ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల వైపు మళ్లారు.ఇలా రాజకీయాలలో తనదైన శైలిలో చక్రం తిప్పుతూ ప్రజా సంక్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నటువంటి ఈమె ఎన్నోసార్లు టాలీవుడ్ హీరోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో విజయశాంతి ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలను ఉద్దేశిస్తూ వీళ్లంతా కూడా దొంగలే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వీరందరూ ముసుగు వేసుకున్న దొంగలే.ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వీళ్ళు కనీసం వారి రెమ్యూనరేషన్ లో 20% ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదని వీళ్లంతా కేవలం సినిమాలలో మాత్రమే హీరోలు బయట కాదు అంటూ. ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఉన్న తనకు ఎవరు ఎలాంటి మద్దతు తెలపలేదని,ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో ఏ ఒక్క హీరో కూడా మద్దతు తెలుపలేదంటూ ఈ సందర్భంగా రాములమ్మ టాలీవుడ్ హీరోలపై ఫైర్ అయ్యారు.

ఇకపోతే తాను గట్టిగా అనుకొని ఉంటే ఈపాటికి ఎప్పుడో కేంద్ర మంత్రి అయ్యేదాన్ని అయితే నాకు పదవుల కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యం. తనకు జనాల కోసం కష్టపడటం అంటే ఇష్టం అని ఈ సందర్భంగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అయితే తనకు సినిమాల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన లేదని ఒకవేళ తనకు నటించాలి అనిపిస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా విజయశాంతి వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -