Yamuna: ఆ ఛానల్ లో నా ఫోటో పెట్టి వెనుక ఆ సీన్స్ చూపించారు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Yamuna: మౌన పోరాటం సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకుంది నటి యమున. ఆ ఒక్క సినిమాతోనే తను నట విశ్వరూపం మొత్తం చూపించింది. ఆ తరువాత మామగారు, సూరిగాడు, బ్రహ్మచారి మొగుడు వంటి సినిమాలలో నటించిన నటి యమున గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనపై వచ్చిన రూమర్లను గురించి స్పందించింది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఒక హోటల్ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తనపై వచ్చినటువంటి ఆరోపణలపై ఇలా వివరణ ఇచ్చింది. తనని కావాలనే ఇలా ఇరికించారని, నిజంగా తనకి ఎలాంటి పాపం తెలీదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయినట్లుగా చెప్పింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెకి మంచి సపోర్టు ఇచ్చారు అని చెప్పింది. నాది ఏ తప్పు లేదు కాబట్టి కోర్టులో గెలిచాను.

గెలిచాను కాబట్టే ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఏమైనాప్పటికీ కుటుంబం మీద పడిన మచ్చ చెరిగిపోదు. ఆ బాధ నాకు ఎప్పటికీ తీరనిది అంటూ ఎమోషనల్ అయింది. మీడియా వాళ్ల మీద నాకు కోపం లేదు కానీ బాధ ఉంది. ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో తప్పులేదు కానీ దయచేసి లేని వాటిని క్రియేట్ చేసి అక్కడ ఏదో ఉన్నట్లు చూపించకండి. నా విషయంలో అదే జరిగింది. టీవీలో ముందుగా నా ఫేస్ పెట్టి వెనక అభ్యంతరకరమైన సన్నివేశాలు పెట్టారు.

అది సినిమా వాళ్లకి అయితే తెలుస్తుంది అది ఒక సినిమా ట్రిక్ అని. బయట వాళ్లకి ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి అందరూ నా గురించి తప్పుగా అనుకుంటారు. కాబట్టి మీడియా మిత్రులను నేను కోరుకునేది ఇదే. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఆ నటులతో పాటు వారి వెనక కుటుంబాలు కూడా ఉంటాయి. నేను, నా కుటుంబం డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది అని చెప్పుకొచ్చింది యమున.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -