Imran Khan: మాజీ ప్రధాని భద్రతకే దిక్కులేదు.. మా క్రికెటర్లను ఎలా పంపమంటారు..?

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై గురువారం వజీరాబాద్‌లో కాల్పులు జరిపిన ఘటనతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్‌గా వెళ్తున్న ఇమ్రాన్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయనకు సైతం గాయాలయ్యాయి. పాకిస్తాన్‌కు 1992లో వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ ఆటగాడు ప్రస్తుత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇమ్రాన్ ఖాన్ కాల్పుల ఘటనతో మరోసారి ఆసియా కప్ – 2023 అంశం తెరపైకి వచ్చింది.

 

గత నెలలో బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఆసియా కప్ లో భారత్ పాల్గొనదని, తటస్థ వేదికపై ఆడితే తప్ప పాకిస్తాన్‌కు భారత్ వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు దేశాల క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ సాగింది. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లి ఆడే అంశం మా చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే తాము దాయాది దేశానికి వెళ్తామని తెలిపారు.

జై షా కామెంట్స్‌కు పాకిస్తాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జై షా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దీనిపై పునరాలోచించకుంటే భవిష్యత్‌లో భారత్‌లో (వన్డే ప్రపంచకప్ – 2023ని ఉద్దేశిస్తూ) జరుగబోయే ఐసీసీ టోర్నీలలో తాము పాల్గొనబోమని స్పందించింది. అయితే పాక్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్వయంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వ్యాఖ్యానించారు.>

ఈ చర్చ వాడివేడిగా జరుగుతుండగానే ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ మొదలైంది. దీంతో క్రికెట్ ప్రేమికుల దృష్టి అటువైపు మళ్లింది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల ఘటనతో ఆసియా కప్-2023 అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది భారత జట్టును పాకిస్తాన్‌కు పంపిస్తే కూడా ఇదే జరుగుతుందని ట్విటర్ వేదికగా నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానికే భద్రత లేనప్పుడు క్రికెటర్లను పట్టించుకునేది ఎవరని అక్కడి ప్రభుత్వాన్ని, పీసీబీని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్-2023 వేదికను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తాజా ఘటనతో పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల మీద కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -