NTR: ఎన్టీఆర్ పై అఘోర చేసిన కామెంట్స్ వింటే దండం పెట్టాల్సిందే!

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నందమూరి కుటుంబం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబంలో నుంచి వచ్చిన స్టార్ హీరోలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం ఉంది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వీరు ముగ్గురిపై మంచి అభిమానం చూపిస్తూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అరవింద్ అఘోరా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ మధ్యనే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఆయన కొమరం భీం పాటలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

 

అయితే ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఈ అవార్డు అందుకున్న సంబరం లో ఉన్నారు. ఇక దేశాన్ని గర్వించే విధంగా ఈ సినిమా చరిత్రను సృష్టించిందని చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్ గురించి అరవింద్ అఘోర ఒక కామెంట్ చేశాడు. నిజానికి ఆయనకు నాటు నాటుకో, కొమరం భీమ్ పాటకో ఆస్కార్ వచ్చిందో తెలియదు అన్నాడు.

 

ఈ రెండు పాటలను బ్యాలెన్స్ చేశారేమో అని తన అనుమానం అన్నాడు. అయితే ఆస్కార్ అవార్డు అందుకోవడానికి కచ్చితంగా అర్హత ఉన్న పాట కొమురం భీమ్ పాట అని అన్నాడు. అందులో ఉండే ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం చాలా పరిపక్వత్వంగా ఉందని అన్నాడు. ఇక ఈ ఆస్కార్ అవార్డు రావడం అనేది అందరూ గర్వించాల్సిన విషయం అని తెలిపాడు. ఇక ఈయనకు ఇష్టమైన హీరో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ అని.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని అన్నాడు. ఈయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవ్వగా ఎన్టీఆర్ అభిమానులు మీరు కరెక్ట్ గుర్తించారు అంటూ ఆయనకు దండం పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -