Chiyaan Vikram: పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

Chiyaan Vikram: తెలుగు తమిళ భాషలలో నటుడు విక్రమ్ కి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈయన తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం సినిమా అవకాశాలను అందుకుంటు నేడు తమిళ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలోతెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోగా కొనసాగడమే కాకుండా ఎన్నో విభిన్నమైన సినిమా చేస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన కోబ్రా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆగస్టు 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో విక్రమ్ దర్శకుడు అజయ్ శ్రీనిధి శెట్టి తిరుచ్చి వెళ్లింది.

ఇక తమ అభిమాన నటీనటులు వస్తున్నారని తెలియడంతో వారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో వారిని కంట్రోల్ చేయడం సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుల వల్ల కాలేదు దీంతో పోలీసులు ఏకంగా అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ విధంగా పోలీసులు అభిమానులపై చేయి చేసుకోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.

ఇలా పోలీసులు అభిమానులపై తిరగబడటమే కాకుండా ఇందులో ఒక పోలీస్ ఏకంగా మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు. అక్కడున్న అభిమానులను ఒకసారిగా కాలితో తన్ని తరిమికొట్టారు. ఈ విధంగా అభిమానులపై పోలీసుల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన విక్రమ్ అభిమానులు అలాగే నేటిజెన్లు పెద్ద ఎత్తున పోలీసులు తీరుపై మండిపడుతున్నారు.

తమ అభిమాన నటుడిని చూడటం కోసం అభిమానులు వస్తే వారి పట్ల పోలీసులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ పెద్ద ఎత్తున పోలీసులపై మండిపడటమే కాకుండా అభిమానుల పై కాలితో తన్నిన ఆ పోలీసు పట్ల తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని మరింత వైరల్ చేస్తూ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు కోరుతున్నారు. విక్రమ్ నటించిన కోబ్రా సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి మరి ఈ సినిమా ఆగస్టు 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -