Star Hero: ఇలాంటి హీరోలు కూడా ఉంటారా.. హీరోయిన్ చెప్పులను మోసుకెళ్లిన హీరో?

Star Hero: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది అంటే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ప్రమోషన్స్ జరిగే వరకే హీరో హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత కొన్నిసార్లు ఆ హీరోయిన్ల పేర్లు కూడా హీరోలు మర్చిపోతుంటారు.అయితే తమ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది హీరోలు హీరోయిన్ల పట్ల కాస్త కేరింగ్ తీసుకున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం హీరోయిన్ల గురించి ఏమాత్రం ఆలోచించరు.

అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విక్రమ్ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నం. విక్రమ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగడమే కాకుండా ఈయన తన లిమిట్స్ లో తాను ఉంటూ తన సినిమాలలో నటించే హీరోయిన్ల పట్ల ఎంతో కేరింగ్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే గతంలో హీరో విక్రమ్ గురించి నటి దీక్షా సేత్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నటి దీక్షా సేత్, హీరో విక్రమ్ ఇద్దరు జంటగా వీడింతే అనే సినిమాలో కలిసిన నటించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయిన వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ కోసం మంచుకొండల్లో షూటింగ్ నిర్వహించారట. అయితే ఆ చలికి తట్టుకోలేక నటి దీక్షా సేత్ లోపలికి పరుగులు పెట్టినట్లు ఈమె ఓ సందర్భంలో వెల్లడించారు.

ఈ క్రమంలోనే తాను తన చెప్పులని అక్కడే వదిలి లోపలకు పరుగులు పెట్టగా హీరో విక్రమ్ తన చెప్పులను చేత పట్టుకొని తీసుకువచ్చారంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇలా హీరోయిన్ల కేరింగ్ తీసుకునే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. నేను ఎంతోమంది హీరోలతో సినిమాలు చేశాను ఇలా ఏ హీరో ని కూడా చూడలేదు.హీరోయిన్ చెప్పులను చేతిలో పట్టుకొని రావడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఈమె హీరో విక్రమ్ పై ప్రశంసలు కురిపించారు.ఇక ఇది తెలిసిన అభిమానులు ఒక్కమగాడు అంటూ హీరో విక్రమ్ పై పెద్ద ఎత్తున అప్పట్లో ప్రశంసలు కురిపించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -