Akhanda 2: బాలయ్య అఖండ 2 మూవీ అలా ఉండబోతుందా?

Akhanda 2: నందమూరి బాలకృష్ణ గత ఏడాది నటించిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి పునరుజ్జీవం తెచ్చింది ఈ సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించి ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచింది. భక్తితో పాటు కమర్షియల్ అంశాలను కూడా జోడించడం ఈ మూవీకి ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్టులోనే క్లూ ఇచ్చారు.

అయితే ఏడాది కావొస్తున్నా సీక్వెల్‌పై ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఈ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో అఖండ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ-2 సినిమా తప్పకుండా ఉంటుందని, కథ కూడా సిద్ధమైందని తెలిపారు. సరైన సమయంలో ఈ సినిమా గురించి ప్రకటన చేస్తామని చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య-బోయపాటి కాంబోలో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే సీక్వెల్ కథ ఎలా ఉంటుందని ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అఖండ సినిమా చివర్లో ఓ చిన్న పాప అఖండను తమతోనే ఉండిపోవాలని కోరుతుంది. కానీ ఏ కష్టం వచ్చినా తాను వస్తానని పాపకు మాట ఇచ్చి అఖండ వెళ్లిపోతాడు. ఆ చిన్న పాప పెరిగి పెద్దది అయ్యాక తల్లిదండ్రులు చనిపోయి ఉంటారని తన దివ్యశక్తితో బాలయ్య తెలుసుకుంటాడు. దీంతో ఆ పాప కష్టాలను తొలగించేందుకు అఖండ మళ్లీ రంగప్రవేశం చేస్తాడు. అసలు ఆ పాపకు ఎలాంటి కష్టాలు వస్తాయన్నదే అఖండ 2 మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.

ఆ సినిమా తర్వాతే అఖండ 2 ఉంటుందా?
ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న ఆయన ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడితో బాలయ్య తన సినిమా పూర్తిచేసేలోగా హీరో రామ్ పోతినేనితో బోయపాటి శ్రీను కూడా తన సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత అఖండ 2 స్టోరీ మీదకు షిఫ్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖండ 2 మూవీని పాన్ ఇండియాగా తీసే అవకాశాలున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -