Akhanda Records: వామ్మో.. అఖండ మూవీ ఖాతాలో ఇన్ని రికార్డులు ఉన్నాయా?

Akhanda Records: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అఖండ హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా అఖండ రికార్డు సృష్టించింది. ఓవర్సీస్‌లోనూ అఖండ భారీ కలెక్షన్లను సాధించింది. గత ఏడాది డిసెంబర్‌ 2న ఈ సినిమా విడుదల అవ్వగా.. నేటికీ విడుదలై ఏడాది అవుతోంది.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. పూర్ణ కీలక పాత్రలో నటించింది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా అలరించాయి. ఈ సినిమా కొన్ని థియేటర్లలో 100 రోజులు నడిచింది. ఇప్పటికాలంలో ఏ సినిమా 100 రోజులు ఆడటం లేదు. ఒక నెలకే థియేటర్ల నుంచి తీసివేస్తున్నారు. నెలలోనే కలెక్షన్లు వచ్చేస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో కూడా అఖండ 100 రోజులు పూర్తి చేసుకుని ఫంక్షన్ కూడా నిర్వహించుకుంది.

నాలుగు థియేటర్లలో 100 రోజులు

100 రోజుల ఫంక్షన్ కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.దాదాపు 20 థియేటర్లలో 100 రోజులు ఈ సినిమా నడించింది. అందులో 4 థియేటర్లలో 100 రోజులు డైరెక్ట్ గా ఆడింది. ఆదోనిలోని రాజశ్రీ, ఎమ్మిగనూరులోని శ్రీనివాస, చిలకలూరిపేటలోని రామకృష్ణ, కోయికుంట్లలోని ఏవీఆర్ థియేటర్లలో 100 రోజులు నడిచింది. గత 10 ఏళ్లలో ఏ సినిమా 100 రోజులు ఆడలేదు. ఇది అఖండకు ఒక రికార్డుగా చెప్పుకొవచ్చు.

ఇక ఒక థియేటర్ ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఇక గతంలో లెజెండ్ సినిమా కడప, కర్నూలులో 400 రోజులుకుపైగా ఆడింది. కడపలో ఒక సెంటర్ లో వెయ్యి రోజులుకుపైగా నడించింది. సౌత్ సినిమాలోనే ఏ హీరోకి ఇంత రికార్డు లేదని, బాలయ్యకే ఆ రికార్డు సొంతమని చెబుతున్నారు. అఖండ ప్రపంచవ్యాప్తంగా రూ.95.50 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ.200 కోట్ల గ్రాస్ సాధించింది. ఇటీవల 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కూడా అఖండ సినిమాను ప్రదర్శించారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -