Dhee 14 Dance Show : ఢీ 14 కోసం అఖిల్ ఆది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Dhee 14 Dance Show : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోని మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో ఢీ కార్యక్రమం ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ ప్రసారమవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమాల్లో పూర్ణ ప్రియమణి శ్రద్ధాదాస్, జానీ మాస్టర్ గణేష్ మాస్టర్ వంటి తదితరులు తరచూ మారుతూ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది వంటి వారు కూడా మెంటర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా మల్లెమాలవారు ఒకసారి వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి ఆ కార్యక్రమంలోకి తీసుకోరు కానీ అఖిల్ మాత్రం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఢీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ ఈ కార్యక్రమానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే హైపర్ ఆది ఈ కార్యక్రమానికి ఒక్కొ కాల్ షీట్ కోసం ఏకంగా 5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈయన ఒక్కో కాల్ షీట్ కు 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఏకంగా జడ్జెస్ తో సమానంగా ఆది రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో హైపర్ ఆదితో పాటు అఖిల్ కూడా సందడి చేస్తున్నారు.

అఖిల్ బిగ్ బాస్ కార్యక్రమంలో రెండు సార్లు పాల్గొని రెండుసార్లు రన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లక ముందు ఈయన బుల్లితెర సీరియల్స్ లో నటించిన సందడి చేశారు.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు ఒక వారానికి దాదాపు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అయితే ఢీ షోలో భాగంగా అఖిల్ ఒక కాల్ షీట్ కోసం లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -