Swetha: 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న మోడల్‌ స్వేత గార్గ్‌ తన భర్త గురించి చెప్పిన విషయాలు వింటే షాక్‌ అవుతారు!

Swetha: సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం మనస్సులో మాటలను సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖలు, హీరోలు, క్రీడాకారులు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తుంటారు. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ గురించి ఒక్కటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. మొదట్లో వారి నిర్ణయాలతో కొంత ఇబ్బంది కలిగినా అవి భవిష్యత్‌కు మంచి బాటలు వేస్తాయంటుంది ప్రముఖ మోడల్, నటి డ్యాన్సర్‌ స్వేత గార్గ్‌.

 

‘కోరా’లో చాలా మంది వారి వారి అభిప్రాయాలు, ప్రశ్నలను పోస్టు చేస్తుంటారు. అవి చూసే చాలా మంది ప్రశ్నలకు సమాధానాలు, అభిప్రాయాలను చెబుతుంటారు. అయితే ఇటీవల ‘మీ పార్టనర్‌ పై మీకు ఉన్న ఆకర్షణ మీలో ఏ విధంగా మార్పు తీసుకొచ్చింది?’ అని ఒకరు కోరాలో పెట్టిన పోస్ట్‌కు నటి స్వేత గార్గ్‌  స్పందించింది. నేను మంచి యాక్టర్‌గా కావాలనుకున్నా.. పెళ్లంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. కానీ.. నాకు 19 ఏళ్లకే పెళ్లి చేసేశారు. 2013లో మా అమ్మకి క్యాన్సర్‌ వచ్చింది. దీంతో నాకు ఎంత తొందరగా పెళ్లైతే అంత మంచిదని మా అమ్మ నాతో ఎప్పుడూ చెబుతుండేది.  ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశారు. అయితే నా భర్తకు నాకు దాదాపుగా 10 ఏళ్ల వయస్సు బేధం ఉంది. దీంతో నాకు చాలా చిరాకు వచ్చేది. అంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తితో పెళ్లి ఎలా.. నేను అతడితో సర్దుకుపోతానో లేదో అనే ఎనెన్నో ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఇంకా వేరే ఆప్షన్‌లో లేక 2013లో పెళ్లి చేశారు. అలా ఇష్టం లేని పెళ్లి చేశారని మా కుటుంబ సభ్యులతో అంతగా మాట్లాడేదాన్ని కాను. అత్తారింటికి వచ్చిన తర్వాత మా బ్రదర్, కుటుంబ సభ్యులు చాలా గుర్తుకు వచ్చేవారు. నా డల్‌నెస్‌ను చూసి మా ఆయన నన్ను అప్పుడప్పుడూ మా అమ్మవాళ్ల ఇంటికి తీసుకెళ్లేవారు.  ఆయన కూడా మా అమ్మనాన్నలను తన సొంతిటి వారిలాగే భావించే విధానం నాకు చాలా మంచిగా అనిపించేది.

 

అలా మెల్లిమెలిగా నా భర్తపై ప్రేమ మర్యాద పెరగడం మొదలైంది.  అయితే నాకున్నా డ్రీమ్‌ వేరే వాటిని మెల్లిమెల్లిగా పక్కకు జరుపుతూ సివిల్‌ సర్వీసెస్‌ లో జాయిన్‌ అవ్వాలి అని ఉండేది. నాకు నా భర్త పూర్తి సపోర్ట్‌ ఇచ్చారు. అలా మా జీవితం గడుస్తుండగా  2014 లో మాకు అబ్బాయి పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నా మొఖంపై మొటిమలు, వెండ్రుకలు రాలడం మొదలయ్యాయి. అయినా నా భర్త ఏనాడు కూడా నన్ను చులకన చూడలేదు. మొదట్లో ఎంత ప్రేమగా చేసేవాడు ఇప్పుడు కూడా అలాగే చూసేవాడు.  అప్పుడు అర్థమైంది మన కుటుంబాన్ని మించిన గౌరవం, హోదా కెరీర్‌ ఏదీ ఉండదు.  ప్రస్తుతం నా భర్త, కొడుకుతో చాలా హ్యాప్పిగా ఉన్నాం.  మన తల్లిదండ్రులు మన గురించి ఏం చేసినా అది మంచి కోరే చేస్తారు. మనకు ఇబ్బంది కలిగినా దాన్ని ఓర్చుకుని ఉంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటామని స్వేత గార్గ్‌ చెప్పుకొచ్చింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -